టాప్ హీరోలు అందరితోను సినిమాలు చేసిన దిల్ రాజ్ కు ఎప్పటి నుండో బాలకృష్ణతో సినిమా చేయలేదు అన్న అసంతృప్తి మిగిలిపోయి ఉంది. దీనితో కొంత కాలంగా దిల్ రాజ్ బాలకృష్ణతో ఒక మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి రాయబారాలు చేస్తున్నట్లు టాక్. 

దీనికితోడు ఎన్నికల ఫలితాలు తరువాత మరో రెండు మూడు సంవత్సరాల వరకు సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలి అని ఆలోచనలు చేస్తున్న బాలకృష్ణ కూడ దిల్ రాజ్ రాయబారాలకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థుతులలో ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ అజిత్ రీమేక్ చేస్తున్న బాలీవుడ్ మూవీ ‘పింక్’ గురించి బాలయ్య దిల్ రాజ్ ల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అమితాబ్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘పింక్’ మూవీ విషయమై బాలయ్యకు కూడ ఆసక్తి ఉన్నా అంత వయసు మళ్ళిన పాత్రలో తాను నటిస్తే జనం అంగీకరిస్తారా అన్న సందేహాలు వెంటాడుతున్నట్లు టాక్. దీనికి బదులు తన బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే ఏదైనా పవర్ ఫుల్ కథను చూడవచ్చు కదా అంటూ బాలయ్య దిల్ రాజ్ కు సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. 

అయితే దిల్ రాజ్ మటుకు ఒకప్పుడు ఎన్టీఆర్ ‘బడిపంతులు’ సినిమాలో ముసలి వేషంలో నటించినప్పుడు ఎంత పేరు వచ్చిందో అంత పేరు ‘పింక్’ సినిమాలోని లాయర్ పాత్రకు వస్తుందని చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో అమ్మాయిల పై అత్యాచారాలు బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో ఈ సబ్జక్ట్ కు అందరు కనెక్ట్ అవుతారు అని దిల్ రాజ్ చెపుతున్న మాటలకు ప్రస్తుతం బాలయ్య అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: