తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించి, దర్శకత్వం క‌ళావాహిని విజ‌య నిర్మల జూన్ 27 న కన్నుమూశారు.   విజయనిర్మల సంతాప సభను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సంధ్యా కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీప్రముఖులు, అభిమానులు హాజరవుతారని భావించిన  కుటుంబసభ్యులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే సంధ్యా కన్వెషనల్ సెంటర్ లో అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది.

కాకపోతే ఆ సమయానికి అక్కడ అథిధులు అప్పుడప్పుడే చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.   ఈ కార్యక్రమంలో విజయనిర్మల కుటుంబ సభ్యులు సూపర్‌ కృష్ణ, నరేష్‌తో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొని నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌ర‌చూరి గోపాల కృష్ణ‌, ర‌మా ప్రభ‌, కోవై స‌ర‌ళ‌, సుబ్బిరామిరెడ్డి, జ‌య‌సుధ‌, గల్లా జ‌యదేవ్‌, మ‌ర‌ళీ మోహ‌న్ తదిత‌రులు హాజ‌ర‌య్యారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలందించిన ఆమె మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. విజ‌య నిర్మల మ‌హిళా సాధికారిత‌కు నిద‌ర్శనమని ప్రశంసించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: