సమంత అద్భుతమైన నటి. ఏ మాయ చేశావే లోనే అది తెలిసిపోయింది ఆ తరువాత స్టార్ హీరోలతో నటించి ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అయితే సమంతకు  అభినయం, అందం  ఎంతా ఉన్నా మెజారిటీ క్రెడిట్ మాత్రం స్టార్ హీరోలకే వెళ్ళిపోయేది


అయితే పెళ్ళి అయిన తరువాత కూడా సమంతా ఇమేజ్ అమాంతం పెరిగిపోవడమే కాదు, ఆమె లేకపోతే ఆ రోల్ ఎవరు అన్న పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ అ ఏకంగా వేదిక మీదనే అనేశాడు. హీరోల కంటే కూడా ఎక్కువగా స్టార్ డం సంపాదించుకున్న ఇపుడు హీరోయిన్  కాదు, హీరో అంటున్నారు.


తెలుగులో అప్పట్లో విజయశాంతి, తరువాత అనుష్క,  ఇపుడు మత్రం సమంత అంటున్నారు. లేడీ ఓరిఎంటెడ్ మూవీస్ చేయడం ఈజీ కాదు, మొత్తం మూవీ బరువు మోయాలి. సమంత మాత్రం యూ టర్న్ మూవీ చేసి తనలో ఆ సత్తా  ఉందని ప్రూవ్ చేసుకుంది. ఇపుడు ఓ బేబీ మూవీ చేసి సూపర్ స్టార్ డం కొట్టేశింది. సమంతా ఎంట్రీకి సినిమా హాళ్ళో విజిల్స్, బయట పెద్ద క‌టౌట్లు,  విదేశాల్లో మంచి కలెక్షన్లు ఇవి చాలవా సమంత ఏ స్టార్ హీరోకు తీసిపోదని చెప్పడానికి.


ఇక సమంత హిట్లు, ఈ ఇమేజ్ చూసి ఆమె భర్త నాగ చైతన్య అభిమానులు తట్టుకోలేకపోతున్నారుట. హిట్లు ఉంటే మా హీరోకు ఉండాలి అదేంటి సమంత అలా టాప్ రేంజికి  వెళ్ళిపోతోందని హర్ట్ అవుతున్నారట. అయితే ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్న చైతు మాత్రం చాల బోల్డ్ గా సమంతా నా కంటే పెద్ద స్టార్ అని ఒప్పుకోవడం నిజంగా చైతూ హ్రుదయాన్ని తెలియచేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: