పవన్‌కళ్యాణ్‌ తనని తాను సీరియస్‌ పొలిటీషియన్‌గా చూపించుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. అయితే అతను ఏమి చేసినా కానీ సినిమా ఇమేజ్‌ మాత్రం కళ్యాణ్‌ ని వెంటాడుతూనే వుంది. ముఖ్యంగా సోషల్ మీడియా పవన్‌కళ్యాణ్‌ ఏమి చేసినా దానిని మరో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోందని క్లియర్‌గా తెలుస్తోంది. ఆ మధ్య గ్లామర్‌ లేకుండా గడ్డంతో సాదాసీదాగా కనిపిస్తే  'బాబా' అంటూ సెటైర్లు వేశారు.

తర్వాత కాస్త గడ్డం ట్రిమ్‌ చేస్తే ఇప్పుడు సినిమాలు చేయడం లేదు కదా..! గ్లామర్‌ అవసరం ఏమి వచ్చిందనే కామెంట్లు కూడా అదే మీడియా చేసింది. తాజాగా టీషర్ట్‌ వేసుకుని కనిపిస్తే సినిమాలకి సిద్ధమవుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. పవన్‌ ఎలా ట్రై చేసినా కానీ అతన్ని సినీ గ్లామర్‌ భూతంలా వెంటాడుతోంది. అసలే మొన్న ఎన్నికలలో ఊహించిన దాని కంటే ఘోరమైన వైఫల్యం చెందడంతో తన పార్టీకి ఒక ఐడెంటిటీ ఎలా తేవాలా..? అంటూ పవన్‌ సతమతమవుతున్న విషయం తెలుస్తూనే ఉంది.

కానీ మీడియా మాత్రం పవన్‌ ని సినీ హీరోని దాటి చూపించడానికి ఒప్పుకోవడం లేదు. ఇలా ఎంతకాలం పవన్‌ని మీడియా ర్యాగింగ్‌ చేస్తుందో కానీ తనని సీరియస్‌గా తీసుకోవడానికి పవన్‌ ఏదైనా గట్టి ప్రణాళికతో దిగక తప్పదు. లేదంటే అతడి ప్రతి చర్యకీ సినీ మేకప్‌ వేస్తుంటే భరించక తప్పదు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్‌  మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం ఉందని ఫ్యాన్స్ కొందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: