Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 2:58 am IST

Menu &Sections

Search

తమిళ్ అర్జున్ రెడ్డికి ఈ కష్టాలేంటీ?

తమిళ్ అర్జున్ రెడ్డికి ఈ కష్టాలేంటీ?
తమిళ్ అర్జున్ రెడ్డికి ఈ కష్టాలేంటీ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒక భాషలో హిట్టైన సినిమాను మరో భాషలో రీమేక్ కావడం సహజం. ఫలితాలు మాత్రం ఆయా భాషల్లో మార్కెట్, నేటివిటీని బట్టి ఉంటుంది. ఇక్కడ చెప్పుకునే రీమేక్ సినిమా పేరు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి గురించి. 2017లో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఓ సెన్షేషన్. స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, హీరో అప్పియరెన్స్, టేకింగ్.. కొత్తగా ఉండి ఏకంగా శివ తరువాత అర్జున్ రెడ్డే అనిపించుకుంది. ఇక హీరో విజయ దేవరకొండ అయితే సౌత్ లోనే సూపర్ పాపులర్ అయిపోయాడు.  

 

 

ఈ సినిమాను హిందీ, తమిళ్ లో రీమేక్ అయింది. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డినే డైరెక్ట్ చేశాడు.. సూపర్ హిట్ అయింది. సమస్యల్లా తమిళ్ లోనే. ఈ సినిమాను తమిళ్ హక్కులను కొన్న E4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరోగా పెట్టి టాప్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో వర్మగా తీశారు. సినిమా పూర్తయ్యాక రషెష్ చూసిన విక్రమ్ కు, ప్రొడక్షన్ హౌస్ కు ఎక్కడో తేడా కొట్టింది. కొడుకు లాంచింగ్ సినిమా.. ఇలా కాదు, ఇంకా బాగా రావాలనే ఉద్దేశ్యంతో  పెద్ద డెసిషనే తీసుకున్నాడు విక్రమ్. ఈ సినిమాను వేరే దర్శకుడితో మళ్లీ రీమేక్ చేయాలని. సినిమాకు అయిన ఖర్చునంతా లాస్ గా భరిస్తానని ఆ సినిమా రిలీజ్ ఆపేశారు. దర్శకుడిని, హీరోయిన్ ను కూడా మార్చి తెలుగు అర్జున్ రెడ్డికి కోడైరెక్టర్ గా పనిచేసిన గిరీశయ్యను దర్శకుడిగా ఎంచుకుని తక్కువ కాలంలోనే మళ్లీ ఆదిత్య వర్మ గా రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ కూడా విక్రమ్ నచ్చలేదని కోలీవుడ్ సమాచారం.

 

లోపం ఎక్కడుందో ఎవరికీ అర్ధం కావట్లేదు. అసలు హీరో సెలక్షనే తప్పేమోనని నిర్మాతలు, మొదటి సినిమానే ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అవసరమా అని విక్రమ్ ఆలోచనలో పడ్డారట.  ప్రస్తుతమైతే ఈ తమిళ్ సినిమా రిలీజ్ పై ఎవరికీ నమ్మకాలు లేవనే సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ ఈ సినిమా ల్యాబ్ కే పరిమితమైనా ఆశ్చర్యపోవక్కరలేదని కోలీవుడ్ లో అనుకుంటున్నారట.

తమిళ్-అర్జున్-రెడ్డి-తెలుగు-అర్జున్-రెడ్డి
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నిత్యా మీనన్.. ఇంత అందం ఎలా?
తంతే బూరెలబుట్టలో పడ్డ ఏజెంట్ ఆత్రేయ హీరో
బిగ్ బాస్ 3 పై నాగార్జున నిర్ణయమిదేనా?
వైఎస్ తో స్నేహం పై సీక్రెట్స్ చెప్పిన చంద్రబాబు
భారతీయుడు-2 అప్డేట్ వచ్చేసింది!
బ్లూ బికినీలో మెరిసిపోతున్న లక్ష్మీరాయ్
ఇసుక మాఫియా మీ హయాంలో కనిపించలేదా బాబూ!
మహేశ్ సినిమా నుంచి తప్పుకున్న వెర్సటైల్ ఆర్టిస్ట్
రామ్ చరణ్ రంగస్థలం రీసౌండ్ అక్కడ కూడా మోగిపోయింది
బార్బీ బొమ్మ కత్రినా కైఫ్ బర్త్ డే స్పెషల్!
పవన్ కల్యాణ్ 'తమ్ముడి'కి 20 ఏళ్ళు
ఆటో, క్యాబ్ ఓనర్ కం డ్రైవర్లకు శుభవార్త
పృథ్వీ ఫస్ట్.. ఆలీ.. నెక్స్ట్.. హూ ఈజ్ ఇన్ నెక్స్ట్ లిస్ట్!
తుప్పు పట్టిన ఐసీసీ రూల్స్ - తప్పు బట్టిన సీనియర్స్
స్టోక్స్ తండ్రికి ఇంగ్లాండ్ గెలుపు నచ్చలేదు.. కారణమిదే!
గవర్నర్ నరసింహన్ అరుదైన రికార్డు.. బీట్ చేసేది ఎవరు?
ఇంగ్లాండేనా.. న్యూజిలాండ్ కూడా వరల్డ్ కప్ విజేతే!
రఫ్ఫాడిస్తున్న 1991 నాటి మెగాస్టార్ మాస్ స్టిల్
70ఏళ్ల బామ్మ బౌలింగ్ కు బౌలర్ ఫిదా
కేశినేని నాని సంచలన ట్వీట్.. లోకేశే టార్గెట్టా!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.