ఒక భాషలో హిట్టైన సినిమాను మరో భాషలో రీమేక్ కావడం సహజం. ఫలితాలు మాత్రం ఆయా భాషల్లో మార్కెట్, నేటివిటీని బట్టి ఉంటుంది. ఇక్కడ చెప్పుకునే రీమేక్ సినిమా పేరు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి గురించి. 2017లో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఓ సెన్షేషన్. స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, హీరో అప్పియరెన్స్, టేకింగ్.. కొత్తగా ఉండి ఏకంగా శివ తరువాత అర్జున్ రెడ్డే అనిపించుకుంది. ఇక హీరో విజయ దేవరకొండ అయితే సౌత్ లోనే సూపర్ పాపులర్ అయిపోయాడు.  

 

 

ఈ సినిమాను హిందీ, తమిళ్ లో రీమేక్ అయింది. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డినే డైరెక్ట్ చేశాడు.. సూపర్ హిట్ అయింది. సమస్యల్లా తమిళ్ లోనే. ఈ సినిమాను తమిళ్ హక్కులను కొన్న E4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరోగా పెట్టి టాప్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో వర్మగా తీశారు. సినిమా పూర్తయ్యాక రషెష్ చూసిన విక్రమ్ కు, ప్రొడక్షన్ హౌస్ కు ఎక్కడో తేడా కొట్టింది. కొడుకు లాంచింగ్ సినిమా.. ఇలా కాదు, ఇంకా బాగా రావాలనే ఉద్దేశ్యంతో  పెద్ద డెసిషనే తీసుకున్నాడు విక్రమ్. ఈ సినిమాను వేరే దర్శకుడితో మళ్లీ రీమేక్ చేయాలని. సినిమాకు అయిన ఖర్చునంతా లాస్ గా భరిస్తానని ఆ సినిమా రిలీజ్ ఆపేశారు. దర్శకుడిని, హీరోయిన్ ను కూడా మార్చి తెలుగు అర్జున్ రెడ్డికి కోడైరెక్టర్ గా పనిచేసిన గిరీశయ్యను దర్శకుడిగా ఎంచుకుని తక్కువ కాలంలోనే మళ్లీ ఆదిత్య వర్మ గా రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ కూడా విక్రమ్ నచ్చలేదని కోలీవుడ్ సమాచారం.

 

లోపం ఎక్కడుందో ఎవరికీ అర్ధం కావట్లేదు. అసలు హీరో సెలక్షనే తప్పేమోనని నిర్మాతలు, మొదటి సినిమానే ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అవసరమా అని విక్రమ్ ఆలోచనలో పడ్డారట.  ప్రస్తుతమైతే ఈ తమిళ్ సినిమా రిలీజ్ పై ఎవరికీ నమ్మకాలు లేవనే సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ ఈ సినిమా ల్యాబ్ కే పరిమితమైనా ఆశ్చర్యపోవక్కరలేదని కోలీవుడ్ లో అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: