మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌. ఇటీవల ‘మణికర్ణిక’తో హిట్‌ అందుకున్న ఆమె తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సినిమాకు ‘ధాకడ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

 

ఈ ప్రచార చిత్రంలో కంగన విభిన్నంగా కనిపించి, సర్‌ప్రైజ్‌ చేశారు. మంట‌ల మ‌ధ్య నిల్చొని రెండు తుపాకులు ప‌ట్టుకొని ఉన్నారు. ఈ లుక్‌ 2001లో ఏంజెలినా జోలీ నటించిన ‘టాంబ్ రైడ‌ర్’ను గుర్తుచేసింది. ఈ సినిమా భారత చిత్ర పరిశ్రమకు టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని కంగన పేర్కొన్నారు.

 

ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌ నా ప్రయాణమే కాదు.. అది భారత చిత్ర పరిశ్రమ ప్రయాణం కూడా.. ‘ధాకడ్‌’ ఫలిస్తే.. సినిమాల్లో నటిస్తున్న మా మహిళలు ఇక వెనక్కి తిరిగి చూడరు’ అని అన్నారు.

 

ఈ చిత్రానికి రజనీష్‌ రాజి ఘాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన యాక్షన్‌ డైరెక్టర్‌ ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: