ఎన్నికల ఫలితాలు తరువాత పవన్ తన లుక్ మార్చుకుని  తానా మహాసభలకు అతిథిగా  అమెరికా వెళ్ళి అక్కడ  చేసిన ఉపన్యాసం పై మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాలను వదిలి మంచి రాజకీయ వేత్తగా కొనసాగాలి అని పవన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అతడిని సినిమా హీరోగానే గుర్తిస్తూ ఉండటం పవన్ కు ఇప్పటికీ మింగుడు పడని సమస్యగా మారింది అని అంటున్నారు. 

పవన్ కళ్యాణ్ చాల భావయుక్తంగా తాను ఓటమి గురించి పట్టించుకోను ఓటమి గురించి ఆలోచించే వ్యక్తి గొప్పవాడు కాలేడు అంటూ తన ఓటమిని మరొక యాంగిల్ లో కవర్ చేసుకున్నాడు. అయితే తానా మహాసభలకు వచ్చిన చాలామంది ప్రతినిధులు మాత్రం పవన్ ‘జనసేన’ సిద్దాంతాల గురించి అడగకుండా పవన్ నటించే సినిమా గురించి తాము ఎదురు చూస్తున్నాము అంటూ చాలామంది ఏకంగా పవన్ తోనే అనడంతో పవన్ షాక్ అయినట్లు సమాచారం. 

దీనితో తాను సినిమా నటుడుని అన్న ఇమేజ్ ని తొలిగించుకుని మంచి రాజకీయ నాయకుడుగా ఎదగాలని తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను ఇంకా ‘సినిమా భూతం’ వెంటాడుతూనే ఉంది అంటూ తానా మహాసభల తరువాత తనను కలిసిన కొంతమందితో పవన్ జోక్ చేసినట్లు టాక్. ఇది ఇలా ఉండగా ‘జనసేన’ భవిష్యత్ గురించి తానా సభ్యులు పవన్ వద్ద ఎటువంటి ప్రస్తావన తీసుకురాకుండా పవన్ ఆలోచనలలోని పత్రిక స్థాపన గురించి కూడ తానా సభ్యులు ఎవరు ఎటువంటి ప్రస్తావన తీసుకు రాలేదని టాక్.

ఇది ఇలా ఉంటే అవినీతి పరులు స్కామ్ లు చేసేవారు మాత్రమే భయపడతారని తనకు ఎలాంటి భయాలు లేవని పవన్ చేసిన కామెంట్స్ పై కూడ దుమారం రేగుతోంది. రాజకీయా అవినీతి చేసిన వ్యక్తుల పేర్లు కూడ తానా మహాసభలలో ఓపెన్ గా చెప్పలేని పవన్ కళ్యాణ్ ధైర్యంగా రాజకీయ పోరాటం ఎలా చేయగలుగుతాడు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనితో పవన్ వీరాభిమానుల నుండి ఆఖరికి అమెరికా తానా సభ్యుల వరకు అందరు పవన్ సినిమాల గురించి ప్రశ్నిస్తున్న పరిస్థితులలో రానున్న రోజులలో ఎంత ప్రయత్నించినా పవన్ తన సినిమా హీరో ఇమేజ్ నుండి తప్పించుకుని రాజకీయ నాయకుడుగా ఎదిగే అవకాశాలు చాల తక్కువ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: