మహేష్ బాబు చెప్పినట్టు.. అందరి సినిమాలు ఒకలా ఉంటె పూరి సినిమాలు మరోలా ఉంటాయి.  అయన సినిమాల్లో గ్యాంగ్ పోరాటాలు, మాఫియా లేకుండా సినిమా ఉండదు.  అలా సినిమా చేస్తారని కూడా ఎవరూ ఊహించారు.  కథ రాస్తున్నాడు అంటే అందులో మాఫియా అంశం మచ్చుకైనా ఉంటుంది.  


టెంపర్ తరువాత ఈ దర్శకుడికి మంచి హిట్ లేదు.  ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేసిన తీరు బాగుంది.  చాలా కాలం తరువాత ఇప్పుడు రామ్ ను అదే ఎనర్జిటిక్ గా చూపించబోతున్నారు పూరి. ఇందులో కూడా కావాల్సినంత మాఫియా ఉంటుంది.  కథలో మాఫియాను ఎలా జొప్పించారు అన్నది తెలియాలి.  


కథకు బలమైన అంశంగా చెప్పుకునే కొన్ని అంశాలు ఉంటాయి.  వాటిని చూపించే విధానం బట్టి సినిమా ఉంటుంది.  ఇందులో డబుల్ దిమాక్ అనే పదం వాడారు.  పైగా రామ్ తల వెనుకభాగంలో ఓ చిప్ పెట్టారు.  అంటే రామ్ రెండు రకాల ఆలోచనలతో కనిపిస్తారా లేదంటే విలన్ ను పట్టుకోవడానికి అలా ట్రై చేశారా అన్నది తెలియాలి.  


పూరితో పాటు రామ్, నిధి అగర్వాల్, అటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్.  ఈ సినిమా హిట్టయితే అందరు బయటపడతారు.  వీరి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది.  పూరి సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: