సినిమా నిర్మాణ బడ్జెట్ పెరిగినప్పుడు హీరోయిన్స్ పారితోషకం రాగ్గించుకోమని నిర్మాతలు మాట్లాడుతుంటారు. అలాగే కొత్త హీరోయిన్స్ కోసం ట్రై చేస్తారు. ఎందుకంటే తక్కువ ఛార్జ్ చేస్తారు కాబట్టి. చిరంజీవి లాంటి మెగాస్టార్‌ చిత్రాల్లో కూడా టాప్‌ హీరోయిన్లు కాకుండా కొత్త హీరోయిన్లు నటించిన సందర్భాలు కోకొల్లలు. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హీరోయిన్‌ అయితే తక్కువ ఛార్జ్‌ చేస్తుందో ఆమెనే ప్రిఫర్‌ చేస్తున్నారు.


అందులోను సదరు హీరోయిన్‌కి సక్సెస్‌లు కూడా వుంటే ముందే కర్చీఫ్‌ వేసేస్తున్నారు. నివేథా పేతురాజ్‌ అంటే తెలిసిన వాళ్లు చాలా తక్కువ మంది వుంటారు. కానీ ఇప్పటికే ఆమె మెంటల్‌ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా చిత్రాల్లో నటించేసింది. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గాను ఛాన్స్‌ దక్కించుకుంది. తాజాగా రామ్‌ హీరోగా నటించే చిత్రంలోను నివేథా పేతురాజ్‌ హీరోయిన్‌గా ఎంపికయింది.


మంచి నటి కావడమే కాకుండా, తక్కువ ధరకే సంతకం చేస్తూ వుండడంతో ఈమెని ఎక్కువగా ప్రిఫర్‌ చేస్తున్నట్టు తెలిసింది. ప్రేక్షకులలో తన పాపులారిటీ సంగతి ఎలా వున్నా ఇండస్ట్రీలో మాత్రం నివేథ మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోయింది. ఇదే ఊపులో ప్రేక్షకులలోను గుర్తింపు పొంది స్టార్‌ హీరోయిన్‌గాను అవతరిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: