టాలీవుడ్ సినిమాలకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక్కడ ఆటా పాటా, నడక, నడత అంతా ఒక పద్ధతిగా ఉంటుందని అంతా అంటారు. టాలీవుడ్లో చేసి ఎంతో మంది చిర కీర్తిని ఆర్జించారు. కీర్తిశేషులయ్యారు. టాలీవుడ్ అంటేనే ఓ గౌరవభావం.


అయితే అది గతం. ఇపుడు మాత్రం టాలీవుడ్ మూవీస్ చూస్తే ఓ రకమైన భావం కలుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా కిస్సింగులు, ఒవర్ హగ్గులు ఎక్కువగా అయ్యాయ‌ని అంటున్నారు. రెచ్చగొట్టుడు భంగిమలతో టాలీవుడ్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయినిది. మూతీ మూతీ నాక్కునే కిస్సులు ఇపుడు టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువైపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


మొదట్లో ఇది బాగోదు అని దూరం జరిగిన వారే కాసుల పంట పండడంతో ఆ సీన్లు కచ్చితంగా ఉండాలని అంటున్నారుట. యూత్ ని అట్రాక్ట్ చేయడానికి హాట్ కిస్సులు ఉండాల్సిందేనని డిసైడ్ అయిపోయారట. మరి ఇదే రకమైన స్పీడ్ తో టాలీవుడ్ వెళ్తే మాత్రం ఇంకెన్ని సీన్లు చూపిస్తారోనని సినీ ప్రియులు అదిరి బెదిరిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: