పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'బద్రి' సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ టాలెంటెడ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా సక్సస్ ను సాధించి తన మార్క్ ఇంకో డైరెక్టర్ ఫాలో అవలేనంతగా ఫేమసయ్యాడు 'పూరీ జగన్నాథ్'. అతి కొద్ది కాలంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చాడు. అంతేకాదు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఏ డైరెక్టర్ సంపాదించలేనంత డబ్బు ని హోదాని సంపాదించాడు. దీంతో పాటు టన్నుల టన్నుల ఫ్యాన్స్ అభిమానాన్ని పొందాడు. దాంతో పాటు భయంకరమైన ఫ్లాప్స్ ని చూశాడు. అయితే ఇవన్నీ కూడా పూరీ అలా చూస్తూ చిన్న నవ్వుతో నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తు వచ్చాడు. అతి తక్కువ బడ్జెట్ తో బాలీవుడ్‌లో బిగ్ బి సర్కార్ అమితాబ్ బచ్చన్ తో తీసిన 'బుడ్డా హోగ తేరా బాప్' కూడా పూరీకి సూపర్ సక్సస్ ను ఇచ్చింది. 

అయితే గత కొన్ని రోజులుగా పూరీ సక్సస్ ను చూడలేకపోతున్నాడు. అందుకు కారణం తన కథల్లో కొత్తదనం లేకపోవడమే అన్న మాట బాగా వినిపిస్తోంది.  ఒకరకంగా చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే పూరీ మొదట్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి..ఇలా డిఫ్రెంట్ జోనర్స్ లో సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగ రాశాడు. కానీ ఆ తర్వాత నుండి ఒకే తరహగా మాఫియా బ్యాగ్డ్రాప్ స్టోరీస్, ఒకేలా ఉండే హీరో క్యారెక్టరైజేషన్, ఎప్పుడు ఒకేలా చూపిస్తున్న హీరోయిన్ గ్లామర్ ప్రేక్షకులకు బాగా బోర్ కొట్టేసింది. అందుకే పూరీ సినిమాకి పరిగెత్తుకెళ్ళి.. నీరసంగా బయటకు వస్తున్నారు. అందుకు ఉదాహరణ తన రీసెంట్ సినిమాలే. 

అందుకే ఈ సారీ డబుల్ ఎనర్జీతో హిట్ కోసం తహ తహ లాడుతున్న ఎనర్జిటిక్ హీరో రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్' ను తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ నిధి అగర్వాల్, 
నభా నటేష్ కి కూడా 'ఇస్మార్ట్' సినిమా సక్సస్ ఎంతో కీలకం. అంతేకాదు పూరీకి, పోకిరి వంటి సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన మెలోడి బ్రహ్మ మణిశర్మకి కూడా ఇస్మార్ట్ సక్సస్ చాలా అవసరం. వీళ్ళందరికి ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే కం బ్యాక్ అవుతారు. లేదంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. అయితే ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. మరి ఈ సినిమా వీళ్ళందరికి ఇస్మార్ట్‌గా హిట్టిస్తుందో లేదో ఈ నెల 18 వరకు ఆగితేగాని తెలీదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: