ఆమె లేటెస్ట్ గా చేసిన సినిమా విడుదల సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ.. పాఠశాల రోజుల నుంచే సినిమాలంటే చాలా ఆసక్తి ఉండేది. కాలేజీ పూర్తయ్యాక నటిగా అరంగేట్రం చేద్దామని అనుకున్నాను. నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డిగారు మా కుటుంబానికి మంచి సన్నిహితుడు. కథానుగుణంగా ఈ సినిమా కోసం 18ఏళ్ల అమ్మాయిని తీసుకోవాలని ఆయన అనుకున్నారు.

 

అప్పుడే నేను 12క్లాస్ పూర్తిచేశాను. ఓ సంవత్సరం విరామం తీసుకొని మెడిసిన్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాను. ఆ టైమ్‌లో శ్రీధర్‌రెడ్డిగారు ఈ కథతో మా కుటుంబాన్ని సంప్రదించారు. కథ వినగానే ఎంతగానో నచ్చింది. దొరసాని పాత్రకు నేను న్యాయం చేయగలననే విశ్వాసం కలిగింది. దాంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పాను.

 

రూపురేఖల పరంగా నేను అచ్చం మా అమ్మలాగానే ఉంటాను. 18ఏళ్ల వయసులో అమ్మ నాలాగే ఉండేదని అప్పటి ఫొటోలు చూస్తే అర్థమైంది. ఇక నటన విషయంలో అమ్మనాన్నలిద్దరిలో ఎవరిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. అలా చేస్తే నాలోని సహజమైన నటన మిస్ అవుతుందనిపించింది. పాత్రను బాగా ఆకళింపు చేసుకొని అందులో జీవించే ప్రయత్నం చేయాలి. ఎవరినీ అనుకరించవొద్దు. అప్పుడే చక్కటి అభినయాన్ని ప్రదర్శిస్తావు అని అమ్మనాన్న సలహాలిచ్చారు. వారి మాటల్ని ఖచ్చితంగా పాటిస్తాను.

 

80దశకం నాటి కథ ఇది. నేను దేవకి అనే దొరసాని పాత్రలో కనిపిస్తాను. అప్పటి దొరసానిలా రాజసం కలబోతగా నా పాత్ర ఉంటుంది. రాజు అనే ఓ సాధారణ యువకుడిని ప్రేమించిన దొరసానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే కథలో ఆసక్తిరంగా ఉంటుంది. అప్పటి గడీల నాటి పరిస్థితుల్ని కళ్లకు కడుతూ దర్శకుడు మహేంద్ర అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: