ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే తరువాత తారక్ ప్రాజెక్ట్ ఏంటంటే సమాధానం లేదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తప్ప మరో లోకం లేదన్నట్టు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు. దీని తర్వాత విడివిడిగా ఇద్దరూ ఏ దర్శకుడితో చేయబోతున్నారనే సస్పెన్స్ మాత్రం ఇప్పట్లో వీడేలా లేదు. ముఖ్యంగా తారక్ విషయంలో దీని గురించిన చర్చ కాస్త ఎక్కువగానే జరుగుతోంది.


అరవింద సమేత వీర రాఘవ టేకింగ్ కు ఫ్లాట్ అయిపోయిన యంగ్ టైగర్ త్రివిక్రమ్ తో మరోసారి చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. కాని అల్లు అర్జున్ సినిమా విడుదలయ్యాకే త్రివిక్రమ్ గుట్టు విప్పుతాడు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ జనతా గ్యారేజ్ టైంలోనే ఇంకో సినిమాకు తారక్ తో కమిట్మెంట్ తీసుకుంది. కాకపోతే ఫలానా టైం లిమిట్ అంటూ ఏదీ లేదు . కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మైత్రికే లాక్ అయ్యి ఉన్నాడు.


ఈ కాంబో కనక  సెట్ అయితే ఆ క్రేజే వేరుఇంకోవైపు ఫామ్ కోల్పోయిన వివి వినాయక్ అదుర్స్ సీక్వెల్ గురించి ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉన్నాడు. కాని జూనియర్ రిస్క్ తీసుకునే పొజిషన్ లో లేడు. టెంపర్ నుంచి మొదలైన సక్సెస్ ట్రాక్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టించే సమస్యే లేదంటున్నాడు. అలాంటప్పుడు ఇది ఆశించడం కూడా సబబు కాదేమో. కొరటాల శివ ప్రస్తుతం చేయబోయే చిరు 152 తర్వాత ఇంకో సారి తారక్ తో చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా సన్నిహితులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: