ప్రస్తుతం అమెరికాలో వాషింగ్టన్ లోజరుగుతున్న తానా మహాసభల కోసం వెళ్ళిన పవన్ ఊహించని రాజకీయ ట్విస్ట్ తీసుకోవడం సంచలనంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఇదే తానా మహాసభలలో జరిగిన ఒక పొలిటికల్ సెమినార్ కు గెస్ట్ గా వచ్చిన భారతీయ జనతాపార్టీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ తో పవన్ ఏకాంతంగా సుమారు గంటసేపు చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో తన సమావేశాల నేపధ్యంలో పవన్ చేస్తున్న రాజకీయాలు ఏమిటి అంటూ ఈ సమావేశాలకు వచ్చిన ప్రతినిధులు ఆశ్చర్య పోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ ను ఆకర్షించి ఒక కీలక శక్తిగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అమెరికాలో జరిగిన వీరిద్దరి ఏకాంత సమావేశం హాట్ టాపిక్ గా మారింది. 

అయితే ఈ సమావేశం గురించి పవన్ సన్నిహితులు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని భారతీయ జనతా పార్టీ గతంలో వాగ్దానం చేసిన నేపధ్యంలో ఆ వాగ్దానాన్ని భారతీయ జనతాపార్టీ అధినాయకత్వానికి గుర్తు చేయమని కోరుతూ పవన్ రామ్ మాధవ్ ను కలిసాడు అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా తానా మహాసభల ప్రతినిధుల నుండి రామ్ మాధవ్ తీవ్ర నిరసనలు ఎదుర్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘వర్తమాన రాజకీయ వ్యవస్థలో ఆవస్యకమైన సంస్కరణలు’ అన్న అంశం పై పవన్ రామ్ మాధవ్ లు కలిసి తానా మహాసభలలో ఉపన్యసించ బోతున్న నేపధ్యంలో వీరిద్దరూ ఏమి చెప్పబోతున్నారు అన్న విషయమై ఆసక్తి నెలకొని ఉంది..      


మరింత సమాచారం తెలుసుకోండి: