రీసెంట్ గా సద్గురు కి నానికి జరిగిన సంభాషణా సందర్భంగా నాని సద్గురుతో ఈ విధంగా అడిగారు.. సద్గురుని నేను అడగబోయే ప్రశ్నలు ట్విట్టర్‌లోనో,  ఎవరి నుంచో సేకరించినవో కావు. నాకేం అనుమానాలు ఉన్నాయో అవే నేను అడగబోతున్నాను. మీకు ఇవి బాగా బేసిక్‌గా, మూర్ఖంగా అనిపించవచ్చు, కానీ అవే నా ప్రశ్నలు. వాటినే నేను మీ ముందు ఉంచబోతున్నాను.

 

ఓ ప్రశ్న చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెడుతోంది. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు... నాకు బాగా గుర్తుంది... నా మొదటి జీతం నాలుగువేలు. అన్నీ వంద రూపాయల నోట్లు. నా ప్యాంటు వెనుక జేబులో పెట్టుకుంటే, జేబు ఉబ్బిపోయింది. బైక్‌ మీద వెళ్తున్నప్పుడు నా దగ్గర చాలా డబ్బుంది అనే ఫీలింగ్‌ కలిగింది. నేను ఎంత సంతోషంగా, ఉత్సాహంగా ఫీల్‌ అయ్యానో నాకింకా గుర్తుంది.

 

ఆ నాలుగు వేలతో సగం హైదరాబాద్‌ కొనేద్దాం అనుకున్నాను. (ప్రేక్షకుల నవ్వులు). అంత సంతోషంగా నేను ఎప్పుడూ లేను. ఇప్పుడు దానికి వెయ్యి రెట్లు సంపాదిస్తున్నాను. కానీ అంత సంతోషంగా మాత్రం లేను. ఇదే కాదు, మేం శనివారం రాత్రుళ్లు సోని ధాబాకు వెళ్ళేవాళ్ళం. ఒక క్వార్టర్‌ (నవ్వులు).. ఒకటే క్వార్టర్‌.. సోమవారం నుంచి శనివారం దాకా ఎదురుచూసేవాడిని శనివారం కోసం.

 

శనివారం పొద్దునైందీ అంటే... చాలా సంతోషంగా ఉండేవాడిని. సాయంకాలం అందరం కలుసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు.... సోని ధాబాకి వెళ్లొచ్చు అని... చాలా సంతోషంగా ఉండేవాడిని. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్‌ సాధించాను. కానీ ఆ విధమైన సంతోషాన్ని నేను మళ్ళీ అనుభవించలేక పోతున్నాను. మనమంతా విజయం కోసం ఎదురుచూస్తున్నాం. ఏదో ఒకరోజు దాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ విజయం అనే ఆలోచనకు మనం ఎక్కువ విలువ కడ్తున్నామేమో అనిపిస్తోంది. అని అడిగిన అయన ప్రశ్నకు గురుతో సహా అక్కడ ఉన్నవారందరూ చప్పట్లు కొట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: