ఈ సంవత్సరం వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్ లు అందుకుంది సమంత. మజిలీ, ఓ బేబీ సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత రెండు సినిమాలు హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉంది. ముఖ్యంగా ఈ వీకెండ్ విడుదలైన ఓ బేబీ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో…..సినిమాకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి.


ముఖ్యంగా సినిమాలో సమంత నటించిన పాత్ర చూసిన ప్రతి ఒక్కరు ఎంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు మంచి వసూళ్లు సాధించింది. వీకెండ్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది.ఇక  ఈ సినిమా విజయంలో సమంత పాత్ర మాత్రం చెప్పుకోదగనిది. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన సినిమాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది.


మీడియాలో ఆమె ఇంటర్వూలు ఇచ్చింది. అక్కడితో ఆగకుండా నిన్నటికి నిన్న హైదరాబాద్ లో థియేటర్ల విజిట్ చేసింది సమంత. అక్కడితో ఆమె ఆగేటట్లు కనపడటం లేదు. ఆంధ్రలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, లాంటి ప్రాంతాలకు వెళ్లి థియేటర్లులో అభిమానులను పలకరించాలనే సంచలన నిర్ణయం సమంత తీసుకోవడంతో ఇండస్ట్రీ మొత్తం సమంత నిర్ణయం పట్ల షాక్ అవుతున్నారు. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: