'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో సినిమా...దీంతో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ముఖ్యంగా బాహుబలి దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో సాహో సినిమా ని బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దక్షిణాది రంగంలో చాలా చోట్ల భారీగా విడుదల చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని ఇటీవల విడుదలైన టీజర్ బట్టి తెలుస్తోంది.

Image result for prabhas nagarjuna

ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో సాహో సినిమా భారీ స్థాయిలో విడుదల చేస్తుంటే మరోపక్క ప్రభాస్ సినిమా విడుదల అవుతున్న సమయంలోనే టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సీక్వెల్ విడుదల చేయడానికి ఏ మాత్రం భయపడటం లేదు. ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం సాహో సినిమా కి మన్మథుడు 2 పోటీగా విడుదల చేస్తున్నట్లు టాక్.

Image result for prabhas nagarjuna

'సాహో' సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కాబోతున్న క్రమంలో అదే నెల మొదటి వారంలోనే నాగార్జున తాను నటించిన మన్మధుడు 2 సినిమా విడుదల చేస్తున్నారు. దీనిబట్టి చూసుకుంటే నాగార్జున ప్రభాస్ సినిమా ని కేర్ చేయకుండా తన సినిమాని విడుదల చేస్తున్నారని కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: