ప్రభాస్ రాజకీయాలను పట్టించుకోడు. ఆఖరికి ప్రభాస్ రాజకీయ వార్తలను చదవను అని కూడ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటి ప్రభాస్ కు నిన్న కృష్ణంరాజు ఇచ్చిన పిలుపు అనుకోని సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతాపార్టీ వ్యూహాలలో ఇప్పుడు మళ్ళీ కృష్ణంరాజు కీలక వ్యక్తిగా మారాడు. 

నిన్న విజయవాడలో జరిగిన భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆపార్టీ చాల కోలాహలంగా నిర్వహించడమే కాకుండా అనేకమంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెబల్ స్టార్ తన ఉపన్యాసంలో మోడీని ఆకాశంలోకి ఎత్తేస్తూ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ వచ్చే ఎన్నికల సమయానికి అధికారంలోకి రావాలి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా బిజెపి లో చేరాలని పిలుపు ఇచ్చాడు.

అంతేకాదు తానెప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎలాంటి కోరికలు కోరలేదనీ ప్రస్తుత పరిస్థితులలో సమస్యలతో సతమతమైపోతున్న ఆంధ్రప్రదేశ్ కు ఒక్క బిజెపి మాత్రమే పరిష్కారాలు సూచించగలదని ఆకాంక్షిస్తూ ప్రస్తుతం ఆ లక్ష్యసాధనకు ప్రభాస్ అభిమానుల సహకారం కావాలి అంటూ పిలుపు ఇచ్చాడు. దీనితో ప్రభాస్ ప్రమేయం లేకుండానే కృష్ణంరాజు పరోక్షంగా ప్రభాస్ అభిమానుల సపోర్ట్ బిజెపికి ఉండబోతోంది అన్న సంకేతాలు ఇచ్చాడు.

అయితే క్రిస్గ్నంరాజు పిలుపుకు ప్రభాస్ స్పందిస్తాడా లేకుంటే ఆపిలుపును పట్టించుకోకుండా మౌనం వహిస్తాడా అన్న విషయమై చాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత కొంత కాలంగా కృష్ణరాజు గవర్నర్ పదవిని ఆశిస్తున్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయానికి కొనసాగింపుగా ప్రభాస్ అభిమానులు బిజెపికి అండగా ఉండబోతున్నారు అన్న సంకేతాలు ఇచ్చి కృష్ణంరాజు తిరిగి భారతీయ జనతాపార్టీ అధినాయకత్వం దృష్టిలో తన పరపతిని పెంచుకోవడానికి ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ పేరు ఉపయోగించి ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: