‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భావోద్వేగంతో కనిపించిన విజయ్ దేవరకొండ తీరును చూసిన వారికి ఆనంద్ దేవరకొండ హీరో అవ్వడం విజయ్ కు ఇష్టం లేదా అన్న సందేహాలు కలగడం సహజం. అయితే వాస్తవానికి ఆనంద్ హీరో అవ్వడం నిజంగానే విజయ్ కు ఇష్టం లేదని టాక్.

విజయ్ హీరోగా సెటిల్ అవ్వకముందు అతడి కుటుంబ బాధ్యత అంతా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆనంద్ దేవరకొండ భరించేవాడు అని విజయ్ సన్నిహితులు అంటారు. అంతేకాదు అనేక సందర్భాలలో అప్పట్లో ఆర్ధికంగా సెటిల్ కాని విజయ్ కి కూడ ఆనంద్ డబ్బు విషయంలో సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయట.

విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిన తరువాత తన అన్నకు కూడ చెప్పకుండా ఆనంద్ అమెరికాలోని తన ఉద్యోగాన్ని వదులుకుని హైదరాబాద్ తిరిగి వచ్చి సినిమా వ్యామోహంలో పడటం విజయ్ కు పూర్తిగా ఇష్టం లేదు అని టాక్. హీరోగా తాను మరింత ఉన్నత స్థానంలోకి చేరుకున్న తరువాత ఒక భారీ వ్యాపార ప్రాజెక్ట్ ను మొదలు పెట్టి ఆ బాధ్యతలను ఆనంద్ కు అప్పగించాలని విజయ్ కోరిక అని తెలుస్తోంది.

అయితే ఈ విషయాలను తాను సున్నితంగా చెప్పినా అర్ధం చేసుకోకుండా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ‘దొరసాని’ లో నటించడంతో ఇక విధిలేక విజయ్ తన తమ్ముడు కోసం చివరి నిముషంలో ‘దొరసాని’ ని ప్రమోట్ చేస్తూ రంగంలోకి దిగవలసి వచ్చింది అని అంటున్నారు. ఈమూవీ బాగా వచ్చింది అని ఒకవైపు చెపుతూ విజయ్ తన సహజ సిద్ధమైన ఇగో ను ప్రదర్శిస్తూ ఈసినిమా నచ్చితేనే చూడండి అంటూ పిలుపును ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ కొందరు ఆసక్తికర చర్చలు చేస్తున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: