వివాహం తరువాత సమంత వరస హిట్స్ తో దూసుకుపోతున్నది.  ఎప్పుడు లేని విధంగా సమంత సినిమాలు స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఆడుతుంటడం విశేషం.  సినిమాపై నమ్మకంతో ఆమె పనిచేతుందో లేదంటే అదృష్టమో తెలియదుగాని చైతును వివాహం చేసుకున్నాక ఆమె స్వరూపం మారిపోయింది.  


గతేడాది వరసగా నాలుగు హిట్స్ అందుకున్న సమంత ఈ ఏడాది మూడు హిట్స్ అందుకొని సక్సెస్ రేటులో అందరికంటే ముందు ఉన్నది.  ఓ బేబీ హిట్ తరువాత నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి అనే ఆలోచనలో పడింది.  సోలోగా హిట్స్ కొడుతుండంతో ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.  


ఎలాంటి సినిమాలు తీయాలి అన్నది వారిని కూడా ఇబ్బంది పెడుతున్నది.  అయితే, ప్రస్తుతం సమంత తమిళంలో సూపర్ హిట్టైన ఆరమ్ సినిమాకు సీక్వెల్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  


ఆరమ్ తమిళంలో సూపర్ హిట్టైంది.  నయనతార హీరోయిన్. ప్రస్తుతం నయనతార ఫుల్ బిజీగా ఉన్నది.  మరో రెండేళ్ల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆరమ్ 2లో నయనతార ప్లేస్ లో సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు.  


మరింత సమాచారం తెలుసుకోండి: