సద్గురువు గా ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షలమంది చేత పిలిపించకునే జగ్గి వాసుదేవ్ ఇచ్చే ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ‘ఈశా’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడుగా ఈయన నిర్వహించే కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతూ ఉంటాయి. 

ఈ ఆధ్యాత్మిక వేత్త తన సందేశాలను మరింత విస్తృతంగా యూత్ లోకి తీసుకు వెళ్ళడానికి ఈశా సంస్థ కొంతమంది ఫిలిం సెలెబ్రెటీలతో ‘టాక్ విత్ సద్గురు’ అన్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. లేటెస్ట్ గా ఈ కార్యక్రమానికి నాని రావడమే కాకుండా తన సందేహాలకు సంబంధించి జగ్గీ వాసుదేవ్ అనేక ప్రశ్నలు అడిగిన సందర్భంలో ఒక ప్రశ్నకు సద్గురు వాసుదేవ్ ఏకంగా నానీకి చురకలు అంటించారు. 

తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండే రోజులలో తనకు మొదటి సంపాదన 4 వేల రూపాయలు వచ్చిన విషయాన్ని నాని గుర్తుకు చేసుకుంటూ ఆ డబ్బును తన జేబులో పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ లోని సగం ఆస్తులు కొన్న ఆనందం కలిగింది అని అప్పటి విషయాలను నాని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తన మొదటి సంపాదన కంటే కొన్ని వందల రెట్లు తాను గానిస్తున్నా తన మొదటి సంపాదనలో వచ్చిన ఆనందం తనకు ఇప్పుడు ఎందుకు కలగడం లేదు అంటూ నాని జగ్గీ వాసుదేవ్ ని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తూ ‘అప్పట్లో నువ్వు సంపాదించింది బతకడం కోసం అయితే ఇప్పుడు సంపాదిస్తున్నది పోగేసుకోవడం కోసం’ అంటూ వాసుదేవ్ నాని మైండ్ బ్లాక్ చేసే సమాధానం ఇచ్చారు. అంతేకాదు హైదరాబాద్ లోని సగం ఆస్తులు నిజంగా నాని కొన్నా ప్రస్తుతం అతడికి సంతృప్తి ఆనందం కలిగే పరిస్థుతులు లేవని అంటూ సద్గురు చేసిన కామెంట్స్ తో నాని నోటి వెంట ఒక్కమాట రాలేదు. ఇదే ఇంటర్వ్యూలో నాని అడిగిన అనేక ప్రశ్నలు పరిశీలిస్తే నానీలో ఇంత ఆధ్యాత్మిక కోణం దాగి ఉందా అని అనిపించడం సహజం..     
 


మరింత సమాచారం తెలుసుకోండి: