ఎంత తెలుగు సినిమా అయినా నా మార్కెట్ నాకుందిక్కడ! అని అనుకున్నాడేమో.. ఆల్రెడీ తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి రీమేక్ అది. అక్కడా విజయం సాధించింది. ఇప్పుడు తిరిగి తెలుగులోకి అనువాదమై రిలీజవుతోంది. మరి ఇక్కడ మరోసారి ఆదరిస్తారా?  ఎన్టీఆర్ లాంటి స్టార్ నటించిన `టెంపర్` చిత్రాన్ని తమిళంలో విశాల్ హీరోగా రీమేక్ చేశారు. అక్కడ అయోగ్య పేరుతో రిలీజై ఘనవిజయం సాధించింది. అయితే అదే సినిమాని తెలుగులోకి అనువదించి రిలీజ్ చేస్తుండడం సర్ ప్రైజ్ టాస్క్.

 

అలా అటు తిరిగి ఇటు తిరిగి వచ్చిన సినిమాని మన ప్రేక్షకులు మరోసారి ఆదరిస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.విశాల్ హీరోగా తెలుగు `టెంపర్`కు రీమేక్(తమిళ్)గా రూపొందిన `అయోగ్య` తెలుగులో అదే టైటిల్ తో విడుదల కానుంది. ఏ.ఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్ సరసన రాశీఖన్నా కథానాయికగా నటించారు. `ఠాగూర్` మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సాధక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు.

 

ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. `అయోగ్య` గురించి మాట్లాడిన విశాల్ ఓ మాటన్నారు. నేను టెంపర్ రీమేక్ లో నటిస్తున్నా. కానీ తెలుగులో దానిని రిలీజ్ చేసే సాహసం చేయను. ఒకవేళ ఇక్కడ రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ అభిమానులు నన్ను పోల్చి చూస్తారు. నేను ఎలా నటించినా ఎన్టీఆర్ రేంజులో చేయలేదనే అంటారు. అందుకే ఇక్కడ రిలీజ్ చేయను. కానీ ఇప్పుడు విశాల్ మనసు మార్చుకున్నారు.

 

తమిళంలో క్లైమాక్స్ మార్చిన కారణంగా, తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆ రోజున 'దొరసాని' .. 'రాజ్ దూత్' వంటి యూత్ ఫుల్ స్టోరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని సన్నిహితులు చెప్పినా ఆయన తగ్గడం లేదట. 'అయోగ్య' సినిమాకు తెలుగులో ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: