2010 సంవత్సరంలో ఏ మాయ చేసావె సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించింది సమంత. కెరీర్ ప్రారంభించి పదేళ్ళు దాటినా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా వరుసగా హిట్ల మీద హిట్లు ఇస్తోంది సమంత. జులై 5 న విడుదలైన సమంత నటించిన ఓహ్ బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. మజిలీ, సూపర్ డీలక్స్, యూ టర్న్ సినిమాల తరువాత మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది సమంత. 
 
సమంత ఓ బేబీ సినిమా గురించి మాట్లాడుతూ తాను సినిమా కంటే ఎక్కువగా సినిమా ప్రమోషన్ల కోసం కష్టపడుతున్నానని, ఓ బేబీ సినిమా విడుదలయ్యే ముందు రోజు రాత్రి తనకు నిద్ర కూడా పట్టలేదన్నారు . ఇంతటి గొప్ప కథతో కూడిన సినిమా తరువాత సినిమాల నుంచి రిటైరవ్వాలని ఉందని కానీ ఈ సినిమా కంటే మంచి కథలు వస్తాయని వాటిలో నటిస్తానని సమంత అన్నారు. 
 
పెళ్ళైన తరువాత కమర్షియల్ సినిమాలకు సమంత దూరంగా ఉన్నప్పటికీ అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. ఓహ్ బేబీ హిట్టైన తరువాత ఎంతో మంది కొత్త దర్శకులు కథలతో సమంతను కలుస్తున్నట్లు తెలుస్తుంది. పెళ్ళి తరువాత అందరు హీరోయిన్లు సినిమాలు రాక ఫేడవుట్ అయిపోతుంటే సమంత మాత్రం కెరీర్లో ఎదుగూతూనే ఉంది. ప్రస్తుతం సమంత తమిళ్ 96 రీమేక్ సినిమాలో శర్వానంద్ కు జోడీగా నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: