ఈరోజుల్లో టాటూలు వేయించుకోవడం ఓ ఫ్యాషన్. అందులోనూ సెలబ్రిటీలు టాటూ వేయించుకుంటే అదేంటో తెలుసుకోవాలని అభిమానులకు పాషన్. త్రిష ఎప్పుడో తన ఎద మీద టాటూ వేయించుకుని అప్పట్లోనే సెన్షేషన్ క్రియేట్ చేసింది. తరువాత చాలా మంది సెలబ్రిటీలు టాటూ వేయించుకున్నారు. వీళ్లలో నాగచైతన్య, సమంతల టాటూల మీద వారి పెళ్లి కాకముందు నుంచీ చాలా కథలే నడిచాయి.

 

మొత్తం మీద వారి పెళ్లయ్యాక ఆ టాటూల గురించి వారు రివీల్ చేశారు. వారి ముంజేతి దగ్గర, మణికట్టలో టాటూలు గురించి కూడా రివీల్ చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సమంత తాను ఇప్పటి వరకూ సీక్రెట్ గా దాచుకున్న టాటూను ఒకదానిని బయటపెట్టింది. తాజాగా ఓ ఫోటో షూట్ చేస్తూ తన కుడి చేయి పైకెత్తి ఓ స్టిల్ ఇచ్చింది. దాంతో రిబ్స్ వద్ద ఉన్న టాటూ కొంచెం కనబడేలా ఓ ఫోటో వచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అయింది. వైట్ డ్రెస్ లో అదిరిపోయిన సమంత అందం ఆ టాటూతో మరింత మెరిసిపోతోంది. “నా బెస్ట్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా.. ఇప్పటి వరకూ దాచుకున్న టాటూ బయటపెడుతున్నా.. చైతూ మై లైఫ్” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

 

దీంతో ఇప్పుడు ఆ టాటూ గురించే నెటిజన్లు ఎంక్వైరీలు చేస్తున్నారు. “సామ్.. ఆ ఫుల్ టాటూ చూపించు.. వైట్ డ్రెస్ లో హాట్ టాటూ.. సూపర్ సెక్సీ టాటూ” అంటూ నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి విషయాల్లో సమంత ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది. అక్కినేని కోడలైనా హాట్ ఫోటోషూట్ లకు కొదవుండదు. స్టైల్ ఫాలో అవడంలో ఎప్పుడూ అప్డేట్ గానే ఉంటుంది. ప్రస్తుతం ఓబేబీ హిట్ ను ఎంజాయ్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: