తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ సిరీస్ తరవాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.


అయితే, ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ‘సాహో’ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో తెరకెక్కుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మితమవుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తొలి పాటను తాజాగా విడుదల చేశారు. ‘సైకో సైయా’ అంటూ సాగే ఈ పాట చాలా స్టైలిష్‌గా ఉంది. ఇదొక క్లబ్ సాంగ్. ఇప్పటికే ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. అది ఆసక్తికరంగా ఉండటంతో పూర్తి వీడియో సాంగ్ కోసం ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. 


మొత్తానికి సోమవారం ఉదయం ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి ఈ పాటను స్వరపరిచారు. తెలుగులో అనిరుధ్ రవిచందర్, ధన్వి భనుశాలి, తనిష్క్ బాగ్చి ఆలపించారు. శ్రీజో రిలిక్స్ అందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: