ఆ మద్య బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం, టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పెద్ద ఎత్తున సంచలనాలు రేపాయి.  సామాన్య మహిళలకే కాదు, సెలబ్రెటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదని ఎంతో మంది సోషల్ మీడియా సాక్షిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.  టాలీవుడ్ లో ఎంతో మంది మేకవన్నె పులులు ఉన్నాయని, సినిమాల్లో నటించడానికి వచ్చే ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని అందుకు తనే పెద్ద సాక్ష్యం అని నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమం తీసుకు వచ్చింది. 

కాస్టింగ్ కౌచ్ పై అన్ని వర్గాల్లో చైతన్యం వచ్చిన సమయానికే శ్రీరెడ్డి చెన్నైవెళ్లిపోయింది.  అక్కడ నుంచి సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంది.  ఇక తనూశ్రీ దత్త, కంగనా రౌనత్ మరికొంత మంది నటీమణులు బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు తెరపైకి తీసుకు వచ్చారు.  తాజాగా మరో హీరోయిన్ తనకు జరిగిన ఆవేదనని బయటపెట్టడం సంచలనం సృష్టించింది.  మలయాళీ నటి గాయత్రి సురేష్ కాస్టింగ్ కౌచ్ పైన సంచనల వ్యాఖ్యలు చేసింది.

సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో అవకాశా కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనకు ఎంతో మంది రాత్రికి పడక సుఖం అందిస్తావా ఛాన్సులు ఇస్తాం అంటూ మెసేజ్ పెట్టేవారని..వాటిని నో అని చెబితే డైరెక్ట్ గా ఫోన్ చేసి కమిట్ మెంట్ ఇస్తేనే సినిమా ఛాన్సులు లేకుండా ఇంట్లోకే పరిమితి అంటూ బెదిరించేవారని ఆవేదన వ్యక్తం చేసింది.  సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి ఈ వేధింపులు మరీ ఎక్కువగా వుంటాయి. ఇండస్ట్రీకి చెందినవారికి ఇలాంటి చేదు అనుభవాలు తక్కువగా ఉంటాయి  అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: