గత కొంత కాలం గా ప్రిన్సు మహేష్ తమిళ దర్శకులకు దూరంగా ఉంటున్నాడు. గతంలో శంకర్ మణిరత్నం లాంటి దర్శకుల సినిమాలను కూడా వదులు కున్నాడు. దూకుడు సూపర్ హిట్ తరువాత మహేష్ ఫై కోలీవుడ్ డైరెక్టర్స్ తాకిడి మరీ ఎక్కువ అయి పోయింది. ప్రముఖ తమిళ దర్శకులు విష్ణు వర్ధన్, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులు ఎంత మంచి కధలు చెప్పినా మహేష్ తప్పించుకుని తిరుగు తున్నాడు. ఈ పరిస్థితుల నేపధ్యంలో టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన కధనం వినిపిస్తోంది. పందెంకోడి, ఆవారా లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు లింగుస్వామి ఒక వెరైటీ కధ తో మహేష్ ఇంటి చుట్టూ తిరిగితే మహేష్ చాలా కాలం ఆలోచించి నో చెప్పాడట.

దీనితో షాక్ కు గురిఅయిన లింగుస్వామి ఈ కధను ఈ మధ్యనే మన బుడ్డోడు ఎన్టీఆర్ కు వినిపిస్తే జూనియర్ మరొక నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ఎస్ అన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ఉంటే బాగుంటుంది అనే సూచన చేసాడట జూనియర్. ఇదే కధ తో తమిళ్ లో హీరో సూర్యా తోను, తెలుగు లో ఎన్టీర్ తోను త్వరలో సెట్స్ పైకి వెళ్ళుతుందని వార్తలు వస్తున్నాయి. మహేష్ వదులుకున్న సినిమా లో ప్రిన్స్ కు నచ్చనవి ఏమిటో? జూనియర్ కు నచ్చినవి ఏమిటో! తెలియాలి అంటే మరి కొన్నిరోజులు ఆగాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: