ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డి. మ‌నోవికాస్ నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోకిర‌ణ్ అబ్బావ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌గోర‌క్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ ను సోమ‌వారం ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో  లాంచ్ చేయ‌గా విలేక‌రుల స‌మావేశంలో...


ప్రొడ్యూస‌ర్ డి. మ‌నోవికాస్ మాట్లాడుతూ...ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్ ర‌వి కూడా ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సెట్స్‌లో ఏ ప్రాబ్ల‌మ్ లేకుండా చాలా చ‌క్క‌గా అవుట్‌పుట్ ఇచ్చారు. క‌థ విన్నాక బాగా న‌చ్చి నేనే ప్రొడ్యూస్ చేశాను. హీరో కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా బాగా క‌ష్ట‌ప‌డింది. నాకు ఈ సినిమాతో ఒక మంచి సిస్ట‌ర్‌లా అయిపోయింది. సినిమా యూనిట్ అంతా బాగా చేశారు.


హీరోయిన్ మాట్లాడుతూ... నా పేరు ర‌హ‌స్య‌. నాకు ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. సినిమా చాలా బావుంటుంది. మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.


ద‌ర్శ‌కుడు ర‌వి మాట్లాడుతూ... మీ అంద‌రికీ టీజ‌ర్ బాగా న‌చ్చింది అనుకుంటున్నాను. ఈ మూవీ మీ అంద‌రికి ఒక ఫ్రెష్ అనుభ‌వాన్ని ఇస్తుంది అని అన్నారు.


హీరో మాట్లాడుతూ... ఇంత‌కు ముందు నేను రెండు వెబ్‌సిరీస్‌లో చేశాను. అప్పుడు కొంచం టెన్స‌ణ్ ఉండేది కాని ఇప్పుడు అది లేదు. మాకు ఇంత మంచి స‌పోర్ట్ ఇస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ చాలా థ్యాంక్స్‌. ఈ సినిమా రెండు, మూడు నెల‌ల్లో విడుద‌ల‌వుతుంది. మూవీ చాలా బాగా వ‌చ్చింది. టీమ్ అంద‌రం బాగా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి ముఖ్య కార‌ణం మా ప్రొడ్యూస‌ర్‌గారి ఫాద‌ర్. ఆయ‌న చాలా మంచి స‌పోర్ట్ ఇచ్చారు. థ్యాంక్యూ వెరీమ‌చ్ అంకుల్ అని అన్నారు. 


యాద‌గిరి ప్రొడ్యూస‌ర్ తండ్రి మాట్లాడుతూ... మా బాబు ముగ్గురు ఫ్రెండ్స్ క‌లిసి సినిమా తీస్దాం అన్నారు. మా బాబు ఇంట్ర‌స్ట్ చూసి ఒప్పుకున్నాను. అన్న మాట ప్ర‌కారం ర‌వి సినిమా చాలా బాగా తీశాడు. నా న‌మ్మ‌క‌న్ని ఒమ్ముచేయ‌లేదు. సినిమా చాలా బాగా వ‌చ్చింది థ్యాంక్యూ అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: