#rrr సినిమా గురించి యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి నిర్మిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రాజమౌళి బ్రాండ్ నేమ్ కు తోడు రామ్ చరణ్.. ఎన్టీఆర్ లాంటి భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు తోడవడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. RRR' టీమ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. 


రాజమౌళి అమెరికా ట్రిప్ లో ఉండగా.. చరణ్ 'సైరా' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ గ్యాప్ లో ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే నెక్స్ట్ వీక్ లో 'RRR' షూటింగ్ ప్రారంభం కాగానే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారట.  ఈ యాక్షన్ బ్లాక్ ను దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ఒక హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.


  అయితే 'RRR' టీమ్ మాత్రం చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి పాల్గొనబోతున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ పై పెదవి విప్పడం లేదు.  ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నెలలోనే అలియా 'RRR' టీమ్ తో జాయిన్ అవుతుందని సమాచారం.  దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  వచ్చే ఏడాది జులై 30 న RRR విడుదల అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: