హీరోయిన్స్ సోషల్ మీడియాను నిత్యం వేడెక్కిస్తూ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తమ హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్నారు. కృతి కర్భందా తెలుసు కదా? సుమంత్ హీరోగా నటించిన 'బోణి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'.. రామ్ 'ఒంగోలు గిత్త' లాంటి సినిమాల్లో నటించింది. అయితే తను నటించిన సినిమాల్లో ఏవి కూడా సూపర్ హిట్లు కాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది.  


తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక హాటు ఫోటోను పోస్ట్ చేసి ఒక డీప్ ఫిలాసఫీ చెప్పింది.."ఆమె కళ్ళల్లో ఒక కథ ఉంది.. చూడండి".  పాపకేం.. ఏదైనా చెప్తుంది.. ఇక్కడ ఎవడి కథ వాడికి అర్థం కావడం లేదు.  ఒక బ్యూటీ కళ్ళలోకి చూసి కథ అర్థం చేసుకోవాలట! అయినా కొంతమంది మేథావులకు ఆ కథలు చక్కగా అర్థం అవుతాయి.  వారు అర్థం చేసుకోండి.  మిగతావాళ్ళు మాత్రం హాటుగా ఉండే ఫోటోతో సరిపెట్టుకోండి. 


ఎందుకంటే షర్టు బొత్తాలు పెట్టుకోకుండా రత్తాలు టైపులో అందాలను వడ్డించింది కదా!ఐస్ బ్లూ కలర్ షర్టు. అదే రంగులో ఉన్న టోర్న్ డెనిమ్ ప్యాంట్ తో స్టైలిష్ గా ఉంది. ఇక బ్లీచ్ చేసిన హెయిర్ తన హాట్నెస్ ను డబల్ చేసింది. కూర్చున్న పోజు.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ అన్నీ సూపర్.  అందుకే నెటిజన్లు రెచ్చిపోయి మరీ కామెంట్లు పెట్టారు. "కళ్ళ సంగతి తెలీదు.. కథ సంగతి తెలీదు. మిగతా అంతా కనిపిస్తోంది".. "ఏక్ దమ్ ఝకాస్".. "నీ చిరిగిన జీన్సు నా మనసును చింపేసింది".. "నీ ఫోటో ఏంటి.. నీ క్యాప్షన్ ఏంటి?" అంటూ కామెంట్స్ పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: