ఎటువంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్ గా ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసి మెగా అభిమానులకు షాక్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతున్న క్రమంలో చాలామంది సినిమా ప్రముఖులు రాజకీయ నేతలు తమ వ్యక్తిగత విషయాల గురించి అలాగే తమపై వస్తున్న ఆరోపణలు గురించి రూమర్స్ గురించి క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు.


అంతేకాకుండా ఫ్యూచర్ కార్యక్రమాలను సినిమాలను ప్రేక్షకులకు , ఫాలోవర్స్ కి తెలియ చెబుతూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ సోషల్ మీడియా పరంగా చాలా తక్కువ గానే యాక్టివ్ గా ఉంటారు. అది కూడా కేవలం ఫేస్బుక్ లో మాత్రమే. ఇప్పటివరకూ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో అసలు ఎకౌంటే లేదు. ఇటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు చరణ్ మరో ముందడుగు వేసి ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ప్రారంభించాడు.


కొద్దిసేపటి క్రితమే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసిన చరణ్ కు అప్పుడే 13 వేలమందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. రంగస్థలం చిత్రంలోని గడ్డం లుక్ తో చరణ్ తొలి పోస్ట్ పెట్టాడు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీనితో ఇన్స్టాగ్రామ్ లోకి అభిమానులు రాంచరణ్ కు గ్రాండ్ గా స్వాగతం పలుకుతున్నారు. 

  



మరింత సమాచారం తెలుసుకోండి: