అమలా పాల్ ఆమె సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. టీజర్ లో ఆమె న్యూడ్ లుక్ ను చూపించి ఫిదా చేసిన యూనిట్, ట్రైలర్ లో దానికి లీడ్ ఏంటో చూపించారు. బెట్ కట్టడం అంటే అమలాకు పిచ్చి. ప్రతిదాన్ని బెట్ బెట్ అంటూ ఊరిస్తుంది. అక్కడితో ఆగితే సరిపోయేది. స్నేహితులతో కలిసి మందు కొడుతూ హుషారెత్తించింది.
పుట్టినరోజు నాడు స్నేహితులతో సరదాగా గడుపుతారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మంచి బట్టలు వేసుకుంటారు. పుట్టిన రోజు అంటే అది కాదని..ఆరోజున బట్టలు లేకుండా ఉండటమే అసలైన పుట్టినరోజు అని చెప్తుంది అమలా. అలా చెప్పిన తరువాత మొత్తం మారిపోతుంది. సడెన్ గా లేచే సారికి ఆమె న్యూడ్ గా ఉంటుంది.
ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఏడో జరిగిందని అర్ధం చేసుకుంటుంది. ఆ తరువాత తాను ఆలా మారడానికి కారణమైన వ్యక్తులపై పగ తీర్చుకుంటుంది అమలా. రివెంజ్ స్టోరీగా దీనిని తెరకెక్కించినా ... స్టోరీకి తగ్గట్టుగా బోల్డ్ గా చిత్రీకరించి ఉంటారు. ఇప్పుడు అందరి చూపులు ఆమెకోసం ఎదురు చూస్తున్నాయి.
జులై 19 న ఆమె సంచలనం సృష్టించేందుకు సిద్ధం అవుతున్నది. అయితే, సెన్సార్ ను దాటుకొని ఎలా వస్తుంది అన్నది సందేహం. ఎంత ఏ సర్టిఫికెట్ ఇచ్చినా.. ఆ సీన్ ను కట్ చేయకుండా లేదంటే బ్లర్ చేయకుండా రిలీజ్ చేస్తారా అన్నది సందేహం. చూద్దాం ఎం జరుగుతుందో.