జాన్వీ కపూర్.. అతిలోక సుందరి ముద్దుల కూతురు.  ఆమె మొదటి సినిమా చూడకుండానే హఠాత్తుగా కన్ను మూసింది. పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.  ఎలాంటి లోటు లేదు.  ఇంకెందుకు దిగులు... దఢక్ మూవీలో డీసెంట్ నటనకు మంచి మార్కులు కొట్టేసింది.  శ్రీదేవి ఉన్నట్లయితే కూతురు నటనకు ఫిదా అయ్యేదేమో.  


ఈ సినిమా తరువాత తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.  బిజీబిజీగా మారిపోయింది.  బిజీగా ఉంటూనే... ఫిట్నెస్ పై శ్రద్ద పెడుతుంది.  నిత్యం జిమ్ కు వెళ్లి కసరత్తులు చేయడం పరిపాటే.  రోజు అవి చేయకుండా అస్సలు కాలం గడవదు అన్నంతగా చేస్తుంది.  


జిమ్ కు వెళ్లే సమయంలో ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  అసలే ఈ కాలం పిల్ల కావడంతో పొట్టి నిక్కరులోనే జిమ్ కు వెళ్తుంది.  ఎంతైనా సెలెబ్రిటీ కదా..  ఆమె జిమ్ కు వచ్చే సమయంలో అక్కడ కుర్రకారు క్యూ కడుతుంటారు.  నిత్యం ఇలా అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో దర్శనం ఇచ్చే జాన్వీ సడెన్ గా చీరలో కనిపించింది.  


జాన్వీని చీరలో అసలు ఎవరూ ఊహించి ఉండరు.  అలా కనిపించే సరికి అంతా షాక్ అయ్యారు.  జాన్వీలో అసలు బ్యూటీ అంటే ఏంటో అందరికి అర్ధం అయ్యింది.  శారీ, స్లీవ్ లెస్ జాకెట్, లుక్ హెయిర్ తో వావ్ అనిపించింది.  గోవిందా గోవిందా సినిమాలోని ఓ సాంగ్ లో శ్రీదేవి ఉన్నట్టుగా అనిపిస్తుంది.  అందుకే అంటారు చీరకట్టులో ఉన్న అందం పొట్టి నిక్కరులో ఎక్కడుంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: