ఈమధ్య కాలంలో వచ్చిన పూరి జగన్నాధ్ సినిమాలు వరుసగా ఫ్లాపవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయినప్పటికీ పూరి కి హీరోలు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? అంటే దీనికి కారణం ఒకటే. ఒక్కో హీరోకు ఒక్కో క్యారెక్టరైజేషన్ చెప్పి ఫ్లాట్ చేస్తుంటాడు. రామ్ కూడా అలానే ఫ్లాటయినట్టు తెలుస్తోంది. "కొత్తగా ఏదో చేయాలనుకున్నాను. ఇంకా చెప్పాలంటే బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అదే టైమ్ లో పూరి జగన్నాధ్.. నేను ఏ మైండ్ సెట్ తో ఉన్నానో, అదే సబ్జెక్ట్ ను చెప్పారు. అలా ఇస్మార్ట్ శంకర్ సెట్ అయింది. ఇప్పటివరకు నన్ను నేను చూడని కోణంలో ఇస్మార్ట్ శంకర్ లో చూసుకున్నాను" అన్నాడు.

రామ్ కు కొత్త మేకోవర్ ఇవ్వడంతో పాటు.. ఇప్పటివరకు అతడు చేయని సైన్స్ ఫిక్షన్ జానర్ ను పరిచయం చేశాడు పూరి. అందుకే రామ్ వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ప్రతి సినిమాలో అతి మంచితనంతో కనిపించడం బోర్ కొట్టిందంటున్నాడు రామ్. "గతంలో కొన్ని సాఫ్ట్ క్యారెక్టర్లు చేశాను. వాటికి సంబంధించి పెద్దగా కిక్ అనిపించలేదు. ఎందుకంటే సీన్ పేపర్ చూస్తున్నప్పుడే నా పెర్ఫార్మెన్స్ నాకు తెలిసిపోయేది. 

ఇంకేదో కొత్తగా చేయాలనుకున్నాను. నా పాత్రల్లో మంచితనం కూడా ఎక్కువైపోయిందనే ఫీలింగ్ వచ్చింది. అంటూ ఇలా ఇస్మార్ట్ శంకర్ చేయడం వెనక అసలు కారణాన్ని బయటపెట్టాడు రామ్. ఏదైతేనేం, పూరి జగన్నాధ్ మరోసారి తన నెరేషన్ తో రామ్ ను ఒప్పించగలిగాడు. మరి ఈ ఇస్మార్ట్ శంకర్‌తో పూరి రామ్ కి హిట్టిస్తాడా లేదా అన్నది ఈ నెల 18 వరకు ఆగితే తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: