ఈ జనరేషన్ హీరోలు, హీరోయిన్లు సమంతను చూసి నేర్చుకోవాల్సింది చాలా వుందని లేటెస్ట్‌గా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అందుకు ఒక బలమైన కారణం కూడా ఉంది. కేవలం సినిమాలో నటించి, తన పారితోషికం తీసుకుని వదిలేయడం కాదు, సినిమా విడుదలకు నెలరోజులు ముందు నుంచి పగలు, రాత్రి అని తేడా లేకుండా, టైమ్ చూసుకోకుండా సినిమా ప్రచారం కోసం కష్టపడడం. ఈ విషయంలో హీరోలు, హీరోయిన్లు.. సమంతను చూసి నేర్చుకోవాలి. ఇంతక ముందు యుటర్న్, మజిలీ, ఇప్పుడు 
ఓ బేబీ. 

ఈ మూడు సినిమాల కోసం స్యామ్ చేసిన పబ్లిసిటీ ఇంతా అంతా కాదు. పెద్ద హీరోయిన్ అని పట్టింపు లేకుండా కూడా సినిమా కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతో ఆరాటపడుతోంది. రీసెంట్‌గా ఓ బేబి ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ లో థియేటర్ల విజిట్ కు కూడా వెళ్లి వచ్చింది సమంత. 
 
అంతేకాదు, ఆంధ్రలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, లాంటి కీలక లోకేషన్లకు వెళ్లి థియేటర్లు విజిట్ చేయాలనే ఆలోచనలో వున్నారు సమంత-నందినీ రెడ్డి. ఈ రేంజ్ హీరోయిన్లు థియేటర్లు విజిట్ చేసింది చాలా తక్కువ. సమంత వస్తే థియేటర్ల వద్ద జనాల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే. అయినప్పటికి అన్నీ జాగ్రత్తలు తీసుకొని థియేటర్ల విజిట్ కు వెళ్ళనుందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: