జీవితా రాజశేఖర్  చిన్న కుమార్తె  శివాత్మికను హీరోయిన్ గా  అలాగే సెన్సేషనల్ హీరో  విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన  చిత్రం ‘దొరసాని’.  జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి. కాగా తాజాగా  ఈ చిత్రం  సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.  'U/A '  సర్టిఫై తో  ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం.  అయితే టీజర్ ట్రైలర్ లను బట్టి  సినిమా  ఒక విషాద ప్రేమ కథ అని అర్ధమవుతుంది. ట్రాజడీ లవ్ స్టోరీ ఎమోషనల్ గా బాగున్నా.. కమర్షియల్ గా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. 


కాగా  దొరసానిగా  టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న శివాత్మిక అద్భుతంగా నటించిందని.. తన ఫెర్పామెన్స్ తో..  సినిమాలోనే  హైలెట్ కాబోతుందని.. ఈ సినిమా విడుదల తరువాత  శివాత్మికకి వరుస ఆఫర్స్ రావడం ఖాయమని ఫిల్మ్ వర్గాల టాక్.  వాస్తవిక సంఘటనల ఆధారంగా  తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో  ఎమోషనల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ చిత్రానికి  కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తుండగా  సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో  యాష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.  ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపధ్య సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెడుతుందట. 





మరింత సమాచారం తెలుసుకోండి: