ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన గాయకుడు. గాన గంధర్వుడు. తెలుగు సినీ గాయక లోకానికి రెండు కళ్ళు అనుకుంటే ఘంటసాల ఒకరు, రెండవ వారు బాలు ఉంటారు. బాలు వంటి గాయకుడు పుట్టరు, పుట్టబోరు అంటారు. ఆయన తెలుగులో పుట్టడం మన అద్రుష్టం. మరి బాలుని నచ్చుకోని వారు ఉంటారా.


కానీ ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కి మాత్రం బాలులో కొన్ని గుణాలు నచ్చవుట. నిజానికి బాలుని చరణ్ పొగుడుతూనే మరీ నాన్న అలా ఉంటే ఎలా అంటూ అమాయకపు మొహం పెట్టాడు. ఓ మీడియా ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ బాలు సంగీతం విషయంలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారని, తన వరకూ ఒకే కానీ అందరూ అలా ఉండరు కదా. అది నాన్న గారితో కొంత ఇబ్బందికరమైన విషయం అన్నాడు.


అదే విధంగా బాలుకు ఉన్న ఓపికను కూడా చరణ్ తప్పుపట్టారు. మరీ అంత ఓపిక, ప్రతీ దానికీ సహనంగా ఉండడం నిజంగా గ్రేట్ అంటూనే అలా ఉండడం కూడా ఒక్కో సమయంలో తనకు నచ్చదని కూడా చరణ్ నిర్మొహమాటంగా చెప్పారు. మరి చరణ్ అలా చెప్పినా కూడా బాలులో ఆ రెండూ కూడా గొప్ప విషయాలే. ఎంతమందికి అవి ఉన్నాయి. సో కొడుకుగా చరణ్ బాలూ లో గొప్ప సుగుణాలు అలా బయటపెట్టారనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: