మహేష్ బాబు కామెడీ సినిమాలు చేసింది తక్కువ. ఇంటర్నల్ గా కామెడీ మిక్స్ చేసి ఉంటుంది గాని, పూర్తి స్థాయిలో కామెడీ ఎంటర్టైనర్ చేయలేదు. అలా చేయడానికి హీరో ఇమేజ్ దృష్ట్యా ఆ అవకాశం దొరకలేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరూ చేస్తున్నారు.
ఈ సినిమాను పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు అనిల్. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాశ్మీర్ లో మహేష్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ తరువాత రైలు సెట్స్ లో షూట్ చేస్తారట.
ఈ సెట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇందులో లాంగ్ రన్ కామెడీ ఉంటుందంట. దాదాపు ప్రధాన తారాగణం అంతా ఈ సీన్స్ లో కనిపిస్తారు. ట్రైన్ కామెడీ సీన్స్ అనగానే మనకు వెంకీ సినిమా గుర్తుకు వస్తుంది. వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ హైలైట్ గా ఉంటుంది.
ఈ సినిమాలో కూడా లాంగ్ రన్ కామెడీని వెంకీ టైప్ లో చేయాలనీ అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. వెంకీ తరహా కామెడీ వర్కౌట్ అయితే సూపర్ కదా. 2020 సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమా ఎలా ఉంటుందో చూడాలి.