అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ‘సైరా’ అలాంటి మూవీకి ఇప్పుడు రాజమౌళి సలహాలు ఇవ్వబోతు ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఎడిటింగ్ దశలో ఉన్న ‘సైరా’ మూవీలోని కొన్ని సీన్స్ ను చిరంజీవి తనకు అత్యంత సన్నిహితుడైన డైలాగ్ రైటర్ సత్యానంద్ కు కొద్దిరోజుల క్రితం చూపించినట్లు టాక్.

ఈ సీన్స్ చూసిన తరువాత సత్యానంద్ ఈమూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని చెపుతూ ఒకసారి రాజమౌళి సలహాలు కూడ ఈమూవీ ఫైనల్ అవుట్ పుట్ పై తీసుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈ ఆలోచన అమలు చేసే పనిలో ప్రస్తుతం చిరంజీవి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

చిరంజీవికి రాఘవేంద్రరావుతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా ముందుగా ‘సైరా’ ను ఎడిటింగ్ స్టేజ్ లో ఆయనకు కూడ చూపెట్టి ఆయన ద్వారా రాజమౌళిని ఈమూవీని చూసే విధంగా ఒత్తిడి తేవాలని చిరంజీవి ఆలోచన అని అంటున్నారు. రాఘవేంద్రరావుకు రాజమౌళి పై ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఆయన పిలిస్తే రాజమౌళి కాదనడు అన్న నమ్మకం చిరంజీవికి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘సైరా’ ఫైనల్ అవుట్ పుట్ చిరంజీవి కోరుకున్నట్లు వచ్చినా ఎక్కడో ఎదో తెలియని లోపం ఈమూవీ విషయంలో చిరంజీవికి కనపడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘సైరా’ మేకింగ్ విషయంలో తనకు ఏర్పడ్డ ఆ సందేహాలను రాజమౌళికి వివరించి ఈమూవీకి సంబంధించి ఆఖరి నిముషంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అన్న విషయాలు రాజమౌళి సలహాతో అనుసరించాలని చిరంజీవి వ్యూహం అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: