స్టార్ మా ప్రెస్టిజియస్ గా రూపొందిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు మరికొద్దిరోజుల్లో మొదలు కాబోతుంది. 14 మంది కంటెస్టంట్స్ తో 100 రోజులు ఒకే ఇంట్లో ఉండే హౌజ్ మెట్స్ ఎలాంటి సందడి చేస్తారో తెలిసిందే. కంటెస్టంట్స్ ఆటలు, పాటలు, గొడవలు ఇలా అన్ని అందులో ఉంటాయి. అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యేది ఒక్కరే.  


బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విన్నర్ గా శివబాలాజి టైటిల్ అందుకోగా.. సెకండ్ సీజన్ విన్నర్ గా కౌశల్ టైటిల్ గెలిచాడు. సెకండ్ సీజన్ లో కౌశల్ ఆర్మీ వల్లే కౌశల్ గెలిచాడని చెప్పొచ్చు. ఇదిలాఉంటే ఫస్ట్, సెకండ్ సీజన్ గెలిచిన వారు కెరియర్ లో పెద్దగా సాధించింది ఏది లేది.


బిగ్ బాస్ టైటిల్ విన్ అవగానే తమకేదో అవకాశాలు వచ్చేసినట్టే అనుకున్నారు. కాని బిగ్ బాస్ 1 గెలిచిన శివ బాలాజి అసలు అడ్రెస్ లేకుండా పోయాడు. ఇక కౌశల్ కూడా కొన్నాళ్లు న్యూస్ ఛానెల్స్ లో హడావిడి చేసినా కెరియర్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు. ఫస్ట్, సెకండ్ సీజన్ లో హడావిడి చేసిన ప్రిన్స్, ఆదర్శ్, తనీష్ ఇలా ఎవరికి పెద్దగా అవకాశాలు ఏమి రాలేదు. 


బిగ్ బాస్ వల్ల ఆ షో నడిచినంత వరకు ఆడియెన్స్ లో వాళ్ల గురించి డిస్కషన్స్ ఉంటాయి తప్ప షో పూర్తయితే అసలు పట్టించుకోవడం లేదు. మరి బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టంట్స్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 కి స్టార్ కంటెస్టంట్స్ పాల్గొంటున్నారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: