సమంత .. నాగచైతన్యతో పెళ్లి తరువాత తానూ చాలా హ్యాపీగా ఉన్నానని చాలా సార్లు చెప్పుకొచ్చింది. అయితే సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫొటోను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకు ఎవరి కంటా పడని ఓ టాటూను చూపించింది. ఎద కింది భాగంలో ఉన్న ఆ టాటూలో తన భర్త పేరు ఉందని చెప్పుకొచ్చిందీ సమంత. ‘‘ఇప్పుడు నేను ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను. (ఇప్పటి వరకు దాచుకున్న ఈ టాటూను ఇప్పుడు చూపిస్తున్నాను). నా భర్త చై అక్కినేని నా ప్రపంచం'' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. 


సమంత వదిలిన ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పిక్ కావడంతో అటు ఆమె అభిమానులు, ఇటు నెటిజన్స్ దీనిని తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో కొద్ది సమయంలోనే ఈ ఫొటో వైరల్ అయిపోయింది. దీనిని అనుకూలంగా కొందరు కామెంట్లుపెడుతుండగా, మరికొందరు మాత్రం సామ్ చేసిన పనికి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రైవేటు భాగంలో ఉన్న దానిని షో చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. 


సమంత టాటూ ఇప్పుడే కాదు.. గతంలోనూ ఒకటి హాట్ టాపిక్ అయింది. చై, సామ్ రహస్యంగా ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఇద్దరి చేతిపై ఒకే రకమైన టాటూలు ఉండడం మీడియా కంట పడింది. ఇంకేముంది వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ అన్ని మీడియా సంస్థలు వార్తలు రాసేశాయి. తర్వాత అంతా అనుకున్నదే నిజమైంది. చై, సామ్ ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: