బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. తెలుగులో రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ మూడవ సీజన్ కు రెడీ అవుతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 త్వరలో మొదలు కాబోతుంది. ఈ సీజన్ లో కంటెస్టంట్స్ అంతా స్టార్ సెలబ్రిటీస్ అని తెలుస్తుంది.


ఇక బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 శివ బాలాజి, కౌశల్ లు టైటిల్ విన్ అయ్యారు. వీరి విజయంలో ఓటింగ్స్ చాలా ప్రాముఖ్యత వహించాయి. శివ బాలాజి టైం లో సోషల్ మీడియా ప్రభావం పెద్దగా పడలేదు. కాని సీజన్ 2 కౌశల్ విన్నింగ్ లో కౌశల్ ఆర్మీ ప్రభావం చాలానే ఉంది. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిందన్న టాక్ వచ్చింది.


అందుకే సీజన్ 3 కంటెస్టంట్స్ కు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారట. తమని పర్సనల్ గా ప్రమోట్ చేసేలా ఎలాంటి ఆర్మీని రెడీ చేసుకోవద్దని చెప్పారట. అలా జరిగినట్టు తెలిస్తే వారిని గేం మధ్యలో నుండి అయినా తొలగించేస్తామని అన్నారట. గేం రూల్స్ పాటించాలని.. వచ్చే సెలబ్రిటీస్ దృష్ట్యా కాస్త జాగ్రత్త వహించాలని చెప్పారట.


హౌజ్ మెట్స్ అంతా సెలబ్రిటీస్ కాబట్టి ఇక్కడ వారు సెలబ్రిటీస్ లానే ప్రవర్తించాలని గొడవలు పడినా తమ వ్యక్తిగత స్వభావాన్ని కోల్పోకూడదని వార్నింగ్ ఇచ్చాడట. ఇదంతా సీజన్ 2 లో హౌజ్ మెట్స్ అంతా కలిసి కౌశల్ మీద ఎగబడితే అతను బయట హీరో అయ్యాడు టైటిల్ కాజేశాడు. అందుకే అలాంటివి జరుగకుండా జాగ్రత్త పడాలని చెప్పారట. కచ్చితంగా ఈసారి బిగ్ బాస్ షో కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. హోస్ట్ గా నాగార్జున కాబట్టి ఆయన చాలా క్లవర్ గా హోస్టింగ్ చేస్తాడని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: