హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టడమే అక్కినేని వారసుడు నాగచైతన్యతో సవ్యసాచి సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత అక్కినేని రెండో వారసుడు అఖిల్‌తో కూడా మిస్టర్ మజ్ను సినిమాలో ఆడిపాడింది. ఈ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. తెలుగులో రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
అక్కడ ‘మున్నా మైఖేల్’ అనే సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అది కూడా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తోంది. నిధి ఖాతాలో ఒక్క హిట్లు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. కేవలం మూడే మూడు సినిమాల్లో నటించిన నిధి అగర్వాల్ ఇన్‌స్టా గ్రామ్‌లో ఆమెకు ఏకంగా మూడు మిలియన్ల మంది ఫాలోయిర్స్ ఉన్నారు.
ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి గల కారణాలలో ఒకటి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫోటోలే. వెండితెర ఫై కంటే నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో మరింత అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలా చేయడం ద్వారా అయినా హీరోల, దర్శకుల దృష్టిలో పడేందుకు ఇలా చేస్తుందన్నది వేరే చెప్పక్కర్లేదుగా..! ఇంతకు నిధి తాజా హాట్ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.