తెలుగు చలన చిత్ర రంగంలో ఎందరో మహానుభావులు..అందులో అతి కొద్ది మందికి చిరస్థాయిగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయినవారు ఉన్నారు. అలాంటి వారిలో గుమ్మడి వెంకటేశ్వరరావు (గుమ్మడి) ఒకరు.  అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు హీరోగా వస్తున్న సమయంలో వారి వయసులో ఉండే ఆయన ఎక్కువ వయసు ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత.

ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు గుమ్మడి.  ఎన్నో చిత్రాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించాడు. అన్ని రకాల వేషాలు ధరించినా సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు.

ఎన్టీఆర్  తో నటించిన తోడు దొంగలు (1954) మహామంత్రి తిమ్మరుసు (1962) చిత్రాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహమతి మొదటిదానికి రాగా, రెండవదానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడుగా ఎంపికయ్యాడు. మాయా బజార్ (1957), మా ఇంటి మహాలక్ష్మి (1959), కులదైవం (1960), కుల గోత్రాలు (1962), జ్యోతి (1977), నెలవంక (1981), మరో మలుపు (1982),ఏకలవ్య (1982), ఈ చరిత్ర ఏ సిరాతో? (1982), గాజు బొమ్మలు (1983), పెళ్ళి పుస్తకం (1991) గుమ్మడి చెరగని ముద్ర వేశారు. గుమ్మడి వెంకటేశ్వరరావు రంగస్థల జీవితం యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజులలోనే ఉపాద్యాయుని ఆదేశంతో పేదరైతు అన్న నాటకంలో వయోవృద్ధుడైన పేద రైతుగా నటించాడు.

ఆ నాటకంలో ఆయన నటనకు ఒక గుర్తింపు లభించింది. ఆకాలంలో నాటకాలంటే పద్యాలు అధికం వచనం కొంచెంగా ఉండేది కాని ఈ నాటకంలో వచనం అధికం ఉండడం ఆయనకు ఆసక్తిని కలిగించింది. కొంత మంది స్నేహితులను కూర్చుకుని స్వంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి అందులో తాను దుర్యోధనుడి పాత్రను అభినయించాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు తొలి సారిగా చలనచిత్ర నటనాభిలాషతో, మల్లిఖార్జునరావుతో కలిసి మద్రాసుకు ప్రయాణం చేసాడు. మద్రాసులో కె.ఎమ్.రెడ్డి, హె.ఎమ్.రెడ్డి వంటి వారిని కలిసి అవకాశం కొరకు అర్ధించి చూసాడు. వారు ఆయనకు సుముఖమైన సమాధానం ఇవ్వక పోవడంతో తిరిగి తెనాలి వెళ్ళి యధావిధిగా జీవితం సాగించాడు.

గుమ్మడి వెంకటేశ్వరరావు ఎదురు చూడని సమయంలో నటనావకాశం లభించింది. ఆసమయంలో లక్షమ్మ మరియు శ్రీలక్షమ్మ పేరుతో పోటీ చిత్రాలు ప్రారంభం అయ్యాయి. లక్షమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకుడు కథాయిక కృష్ణవేణి నిర్మాత. శ్రీలక్షమ్మ చిత్రానికి ఘంటసాల రఘురామయ్య దర్శకనిర్మాత కాగా అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి నాయికానాయకులుగా ఉన్నారు. అందులో ఒక పాత్రకు, రంగస్థల నటి శేషమాంబనొప్పించటానికి, ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ డి.ఎల్ నారాయణరావు తెనాలి వచ్చాడు. గుమ్మడి సినీప్రవేశం అదృష్ట దీపుడు (1950) సినిమాతో జరిగింది. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి.

తదుపరి, అవకాశాలు లేవని, తిరిగి వెళ్ళాలని భావించిన సమయంలో, ఎన్.టి. రామారావుతో కలిగిన పరిచయం వలన ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావును తిరిగి వెళ్ళవద్దని, తన స్వంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేసాడు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్.టి. రామారావు ఆయనకు తన స్వంత చిత్రం పిచ్చిపుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది. ఎన్.టి.రామారావు తన తరువాతి చిత్రం తోడు దొంగలు చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడుదొంగలుగా అయన, ఎన్.టి.రామారావు నటించారు. ఆ చిత్రం విజయం సాధించక పోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం.


గుమ్మడి పోషించిన పాత్రలు :
పురాణ పాత్రలు: బలరాముడు, భీష్ముడు, భృగుమహర్షి, దుర్వాసుడు, జమదగ్ని, కర్ణుడు, విశ్వామిత్రుడు, ధర్మరాజు, సత్రాజిత్తు, దశరథుడు
చారిత్రాత్మక పాత్రలు: పోతన, కబీర్ దాసు, తిమ్మరుసు, కాశీనాయన
సాంఘిక పాత్రలు: దివాన్, డాక్టర్, ముఖ్యమంత్రి, వ్యవసాయదారుడు, న్యాయవాది, మునసబు, నందుడు, పోలీసు అధికారి, ప్రధానోపాధ్యాయుడు, జమీందారు

పురస్కారాలు :
1998 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చి సత్కరించింది.
1982 : మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: