తెలుగు సినీరంగం రోజురోజుకూ ఎదుగుతోంది. వంద కోట్ల క్లబ్ లో చేరడం ఇప్పుడు సింపుల్ గా మారింది. అయితే ఇదంతా పాజిటివ్ కోణం.. దీంతో పాటు నెగిటివ్ కోణం కూడా ఉంది. అదే పన్ను ఎగవేత.. ఇందులోనూ మన టాలీవుడ్ చాలా హుషారుగా ఉందని కేందం నివేదికలు చెబుతున్నాయి.


టాలీవుడ్ పన్ను ఎగవేతల కారణంగా ఏకంగా కేంద్రానికి 2వేల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ వెలుగులోకి తెచ్చింది. వినోద రంగంలో భారీగా పన్ను ఎగవేతలు జరుగుతున్న విషయాన్ని కాగ్ బయటపెట్టింది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. టెలివిజన్, రేడియో, మ్యూజిక్, ఈవెంట్ మేనేజ్ మెంట్, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, బ్రాడ్ కాస్టింగ్, స్పోర్ట్స్, అమ్యూజ్ మెంట్ ఇలా అన్నిరంగాల్లోనూ కలిపి ఈ మొత్తం వెలుగు చూసింది.


దేశంలోని చట్టంలోని లోపాలను క్యాష్ చేసుకుని టాలీవుడ్ నిర్మాతలు ట్యాక్స్ లు ఎగ్గొడుతున్నట్టు కాగ్ గుర్తించింది. 2013-14 నుంచి 2016-17 వరకు కాగ్.. ఆడిటింగ్ నిర్వహించింది. ఈ కాలంలో దాఖలైన 13 వేల 31 అసెస్ మెంట్లలో 6 వేల 516 అసెస్ మెంట్లను కాగ్ తనిఖీ చేసింది. అందులో 726 చోట్ల లోపాలు ఉన్నట్టు తేలింది.


ఈ లోపాల కారణంగా ప్రభుత్వానికి రూ.2వేల 267 కోట్ల మేర ఆదాయ నష్టం జరిగినట్టు వెల్లడించింది. వినోద రంగానికి సింబంధించి అసెసీలు సమర్పించిన అసెస్ మెంట్లపై కాగ్ తన నివేదికను పార్లమెంటులో పెట్టింది. అంటే మొత్తానికి మన నిర్మాతలు కూడా కేంద్రానికి సినిమా చూపిస్తున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: