వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రల్లో నటించిన విశ్వనటుడు కమల్ హాసన్ రెండవ కుమార్తె అక్షర హాసన్ మాత్రం కలామ్ చెప్పింది తుచ తప్పకుండా ఫాలో అవుతున్నట్టుంది. ఇంతకి ఆయన చెప్పింది ఏమిటంటారా... అదేనండి కలలు కనండి... వాటిని నిజం చేయండి. ఈ మాటను అబ్దుల్ కలాం అన్నారు. కానీ దీనిని ఎవరు ఎంత పెద్దగా పట్టించుకోరు... కానీ కమల్ రెండో కుమార్తే తన కలలను నిజం చేసుకుంటుంది.

ప్రస్తుతం తమిళ హీరో విక్రమ్ చిత్రం 'కదరం కొండన్' లో అక్షర ఒక కీలక పాత్ర పోషిస్తోంది.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.  ఆ ఇంటర్వ్యూలో అక్షర తన కలల గురించి మాట్లాడింది.  అందులో ఒక కల ఏంటంటే కమల్ హాసన్.. రజనీకాంత్ హీరోలుగా ఒక భారీ మల్టిస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించాలట.

అక్షర సెకండ్ డ్రీమ్ ఏంటంటే.. నాన్నగారు కమల్ హాసన్ హీరోగా ఒక సూపర్ హీరో ఫిలిం ను డైరెక్ట్ చేయాలని ఉందట.  జరుగుతుందో లేదో తర్వాత సంగతి.. కమల్ డాటర్ మాత్రం కలామ్ గారి ఫిలాసఫీని చక్కగా ఫాలో అవుతోంది.  ఒకవేళ తనకు లక్ వర్క్ అవుట్ అయ్యి.. ఆ కలలు తీరినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు!

ఇంతకీ అక్షరకు ఈ దర్శకత్వం కలలు ఎందుకంటే.. హీరోయిన్ గా పరిచయం కాకముందు అక్షర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో దర్శకత్వం జోలికి పోదని అనుకున్నారు.  కానీ అలా ఏం లేదని.. అక్షరకు ఇప్పటికీ దర్శకత్వం పై మక్కువ ఉందని క్లారిటీ ఇచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: