తమిళ నిర్మాణం మండల అధ్యక్ష ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగాయి. తాజాగా జరిగిన ఎన్నికలు కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేక వివాదాలకు తెరలేపింది. గత ఎన్నికలలో చాలా పోటాపోటీగా పని చేసి గెలిచిన హీరో విశాల్ తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా మనదే గెలుపు అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అయితే ఎలక్షన్ రిజల్ట్స్ విషయంలో లేట్ అవుతున్న క్రమంలో చెన్నై కోర్టులో విశాల్ ఇటీవల ఓట్ల లెక్కింపు త్వరగా చేయాలని వేసిన పిటిషన్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది.


చెన్నై హైకోర్టు నడిఘర్ ఎలక్షన్స్  రిజల్ట్ కి మరోసారి బ్రేక్ వేసింది. దీంతో మొన్నటివరకు కలిసి పనిచేసిన కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారు ఎలక్షన్ రిజల్ట్ లేట్ అవుతున్న క్రమంలో వర్గపోరు బయటపడుతూ తమ లోని అంతర్గత విభేదాలను బయట పెడుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే విధంగా ప్రస్తుత పరిస్థితి తయారైంది. నిరంతర వివాదాలతో జరిగిన ఎలక్షన్స్ కి కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇవ్వగా సోమవారం రిజల్ట్ రావాల్సి ఉంది.


కోలీవుడ్ నడిఘర్ సంఘం అధ్యక్ష్య పదవి ఎవరిని వరిస్తుంధో అని అంతా ఎదురుచూస్తుండగా సడన్ గా హైకోర్టు బ్రేక్ వేసింది. న్యాయ స్థానం నుంచి ఆదేశాలు వెలువడేంత వరకు ఓట్ల లెక్కింపు జరగకూడదని కోర్టు తెలిపింది. దీంతో ప్రస్తుతం తమిళం ఇండస్ట్రీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువవుతాయని ఇండస్ట్రీకు చెందిన కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా చెన్నై హైకోర్టు త్వరగా ఎన్నికల రిజల్ట్ విడుదల చేయాలని కోరుకుంటున్నారు. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: