అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో రకుల్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో రకుల్‌ పేరు అవంతిక. టీజర్ విషయానికి వస్తే ...

‘అవంతిక’ పేరు ఎంత వినసొంపుగా ఉంది... అంతే పద్దతి గల అమ్మాయి అని బామ్మ అంటుంది. ఐ లవ్ యూ ఆంటీ అను అవంతిక అంటుంది. ఆ అమ్మాయి చల్లని గాలి లాంటిది అని వెన్నెల కిషోర్ అంటారు. అంతలో వ్యంగంగా బోగేం కాదు అని నాగార్జున చెబుతాడు. ఇంతలో రకుల్, నాగార్జు మధ్యలో కొన్ని హస్య చిత్రాలు ఉంచారు. మళ్ళీ నాగార్జున రెండు సంవత్సరాలుగా అమ్మాయి ప్రేమిస్తున్నా అనగానే రకల్ నవ్వుతూ ఈ వయసులో నువ్వు లవ్ ఫెల్యూర్ తట్టుకోలేవు అంటుంది. ఇప్పటి వరకు యూ సర్టిఫికెట్ ప్రయత్నించాను... ఇప్పుడు ఏ సర్టిఫికేట్ చూపిస్తా అంటూ తన కల్లలోకి చూడమని నాగార్జునకు రకుల్ సైగ చేస్తుంది. ఇంతలో రకుల్ సిగిరెట్ తాగే చిత్రాన్ని ప్రజెంట్ చేసి మన్మథుడు టైటిల్ ఉంచారు. ఇంతలో వెన్నెల కిషోర్ వచ్చి సచ్ ఏ డేంజరస్ బేబీ.. ఐలవ్ యూ మోర్ అంటూ వెల్లిపోతాడు. ఈ మొత్తం టీజర్ నిడివి 1 నిమిషం 5 సెంకడ్లుగా విడుదల చేశారు.

‘అవంతిక.. పేరు ఎంత సూపర్‌గా ఉందో అంత పద్ధతిగల అమ్మాయి’ అన్న డైలాగ్‌తో రకుల్‌ పాత్రను పరిచయం చేశారు. కానీ ఆమె పైకి చూడటానికి సంప్రదాయంగా కనిపిస్తూనే మరోపక్క ఊరమాస్‌గా ప్రవర్తిస్తూ ఉంటారు. సిగరెట్లు తాగుతూ గడుసు పిల్లలా ప్రవర్తిస్తుంటారు.

మన్మథుడు 2 రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్‌లో నిర్మించారు. ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌  బ్యానర్‌లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.


https://youtu.be/FJH_d668y1g

మరింత సమాచారం తెలుసుకోండి: