తెలుగులో ఎన్నో రియాలిటీ షోలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ షో ఒక సంచలనం. వరుస విజయాలతో జోరు మీదున్న ఎన్టీయార్ ఆ షో హోస్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆ షోపై ఆసక్తి కలిగింది.టీఆర్పీ రేటింగుల్లో కూడా చరిత్ర సృష్టించింది బిగ్ బాస్ సీజన్ 1. కానీ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన ఎన్టీయార్ బిగ్ బాస్ సీజన్ 2 చేయడానికి ఆసక్తి చూపలేదు. సీజన్ 2 కోసం ఎంతోమంది హీరోలను ట్రై చేసి నానిని హోస్ట్ చేయడానికి ఒప్పించింది స్టార్ మా యాజమాన్యం. 
 
కానీ సీజన్ 1 రేంజ్లో సీజన్ 2 హిట్టు కాలేదు. కొన్ని స్క్రిప్ట్ పరమైన లోపాలు కూడా సీజన్ 2 లో జరిగాయి . ఓటింగ్ విధానంపై కూడా విమర్శలు వచ్చాయి. కొంతమంది బయట ఆర్మీలను తయారు చేసుకుని ఓట్లు వేయించుకుంటున్నారని, కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకుని ఓట్లు వేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఒకానొక దశలో హోస్ట్ చేసిన నానిని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. 
 
మరి బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విమర్శలు మరలా రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడులాంటి రియాలిటీ షో చేసిన నాగార్జునకు బిగ్ బాస్ హోస్ట్ చేయటం కష్టమైన విషయం కాదు. స్క్రిప్ట్ విషయంలో, ఓటింగ్ విషయంలోమాత్రం ఈసారి ఎలాంటి జాగ్రత్తలు బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకోబోతున్నారో చూడాలి. సీజన్ 2 లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ సీజన్ 3 హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: